మళ్లీ జోడీ కట్టనున్న నాని, సాయి పల్లవి..

0
274

న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి తో మళ్లీ జత కట్టనున్నాడు. ఇటీవల నాని ‘వి’ షూటింగ్ ని పూర్తి చేసుకుని.. ఉగాదికి విడుదల కానుంది. ప్రస్తుతం నాని శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టక్ జగదీశ్’ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. వీరి కాంబినేషన్ లో ‘నిన్ను కోరి’ చిత్రం తర్వాత రెండవ చిత్రమిది. ఇదిలా ఉండగా నాని ఇప్పుడు ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నటించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ చిత్రంలో నాని సరసన నటించడానికి సాయి పల్లవిని అనుకుంటున్నారు. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ మూవీలో నాగచైతన్య సరసన నటిస్తోంది. అంతేకాకుండా ‘విరాటపర్వం’ లో రానా సరసన నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here