రివ్యూ: ‘జాను’.. ఫీల్ ది లవ్

0
184

చిత్రం: జాను
న‌టీన‌టులు: శ‌ర్వానంద్‌, సమంత‌, వెన్నెల‌కిషోర్‌, శ‌ర‌ణ్య ప్రదీప్‌, తాగుబోతు ర‌మేశ్‌, వ‌ర్ష బొల్లమ్మ‌, ర‌ఘుబాబు, గౌరి, సాయికుమార్ తదిత‌రులు.
సంగీతం: గోవింద్ వ‌సంత‌
ఛాయా గ్రహ‌ణం: మ‌హేంద్రన్ జ‌య‌రాజ్‌
మాట‌లు: మిర్చి కిర‌ణ్
పాట‌లు: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, శ్రీమ‌ణి
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్
ద‌ర్శక‌త్వం: సి.ప్రేమ్‌కుమార్‌
సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌
విడుద‌ల‌: 7 ఫిబ్రవ‌రి 2020

సమంత అక్కినేని, శర్వానంద్ జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ‘జాను’. తమిళంలో 96 రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శర్వానంద్ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా నటించారు. గోవింద్ వసంత సంగీతం అందించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ: కె.రామ‌చంద్ర అలియాస్ రామ్(శ‌ర్వానంద్‌) ట్రావెల్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్. అలా ఒకసారి త‌ను పుట్టి పెరిగిన వైజాగ్ వెళ్తాడు. త‌ను చదివిన స్కూల్‌ని మ‌రోసారి చూసి పాత జ్ఞాప‌కాల్ని గుర్తుచేసుకుంటాడు. ఆ సమయంలోనే తన ఫ్రెండ్స్ అంతా కలిసి అప్పుడు చదువుకున్న వారంతా మల్లి కలుసుకునేలా హైదరాబాద్ లో గెట్ తో గెదర్ ఏర్పాటు చేస్తారు. ఆ కార్యక్రమానికి జాన‌కిదేవి అలియాస్ జాను(స‌మంత‌) కూడా సింగ‌పూర్ నుంచి వ‌స్తుంది. రామ్‌ జాను ప‌దో త‌ర‌గ‌తిలోనే ప్రేమ‌లో ప‌డ‌తారు. కానీ అనుకోకుండా విడిపోతారు. మ‌ళ్లీ దాదాపు 17 యేళ్ల త‌ర్వాత ఈ కార్యక్రమం ద్వారా క‌లిసిన వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? వారి ప్రేమ గురించి ఏం మాట్లాడుకున్నారు? వారి జీవితాల్లో ఏం జరిగింది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

వివరణ: జాను.. మన చిన్ననాటి స్నేహితుల జ్ఞాపకాల్ని.. తొలిప్రేమలోని అనుభూతిని మనసుకు హద్దుకునే ఎమోషన్స్ తో ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. స్కూల్ లోకి ఎంటర్ అయిన దగ్గరి నుండి కథ భావోద్వేగాలతో ప్రేక్షకులను అక్కడే కట్టి పడేసేలా ముందుకు సాగుతుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో కొంచెం సాగతీతగా అనిపిస్తుంది.

పూర్వ విద్యార్థుల కలయిక కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం.. ఒక్కొక్కరు వేరు వేరుగా స్పందించడంతో సరదాగా సాగిపోతుంది. తర్వాత సమంత శర్వానంద్ ల తొలిప్రేమలోని మధురానుభూతులు.. మళ్లీ వారు కలుసుకోవడం.. ఇంతలో రామ్ గురించి ఒక ముఖ్యమైన విషయం జానుకు తెలిసి ఎమోషనల్ అవడం… భావోద్వేగాలను చాలా బాగా పండించేలా ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు.

నటన & సాంకేతికత: శర్వానంద్ సమంత వారి పాత్రలకు ప్రాణం పోశారు. వీరిద్దరి పాత్రలు సినిమాకు బలం. కథ చాలా వరకు వీరిద్దరి మధ్యే సాగుతుంది. వెన్నెల‌కిషోర్‌ తాగుబోతు ర‌మేశ్‌ ర‌ఘుబాబు శ‌ర‌ణ్య త‌దిత‌రులు క్లాస్‌మేట్స్‌గా చాలా బాగా చేసారు. చిన్నప్పటి రామ్ జానులుగా క‌నిపించిన సాయికుమార్‌ గౌరిలు కూడా చాలా బాగా నటించారు. సాంకేతిక విలువలు బాగున్నాయి. గోవింద్ వ‌సంత సంగీతం మ‌హేంద్రన్ జైరాజ్ కెమెరా ప‌నిత‌నం మిర్చికిర‌ణ్ మాట‌లు కూడా అందరినీ మెప్పించేలా ఉన్నాయి. దిల్‌రాజు కెరీర్ లో తొలి రీమేక్ సినిమా ఇది. ఆయ‌న సంస్థ స్థాయికి త‌గ్గట్టుగా నిర్మాణ విలువ‌లు కూడా చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:
కథ
సమంత, శర్వానంద్
భావోద్వేగాలు
సంగీతం
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాల్లో సాగతీత

రివ్యూ: జాను.. ఫీల్ ది లవ్

రేటింగ్: 3.25/5

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here