జబర్దస్త్ అభిమానులకు మరో షాక్.. నాగబాబు బాటలోనే ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు.. ఇదీ విషయం!

0
297

జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షో.. ఈ షో గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరమే లేదు. జబర్దస్త్ కంటిస్టెంట్స్ వేసే పంచ్ డైలాగులు, జడ్జ్, యాంకర్స్ నవ్వుల హరివిల్లులు అన్నీ కూడా ఈ షోలో హైలైట్ అంశాలే. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, రష్మీ, అనసూయ, నాగబాబు ఇలా ఎవరికీ వారే సాటి. గత కొన్నేళ్లుగా బుల్లితెర ఆడియన్స్ ని ఫుల్లుగా నవ్విస్తూ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ షోకు షాకుల మీద షాకులు తగులుతున్నాయనేది తాజా సమాచారం.

Image result for nagababu photos

ఇప్పటికే జబర్దస్త్ షో నుంచి నాగబాబు నిష్క్రమించిన సంగతి తెలిసిందే. రెమ్మ్యూనరేషన్ విషయమై నాగబాబు తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై నాగబాబు వివరణ కూడా ఇచ్చుకున్నారు. నిన్న (నవంబర్ 22) నాటి షోతో జబర్దస్త్ తెరకు నాగబాబు బై బై చెప్పేశారు. దీంతో జబర్దస్త్ అభిమానుల్లో ఒకింత నిరుత్సాహం నెలకొంది.

Image result for reshmi anasuya photos

సరిగ్గా ఈ తరుణంలో నాగబాబు బాటలోనే జబర్దస్త్ భామలు రష్మీ, అనసూయ కూడా వెళుతున్నారని తెలుస్తుండటం మరింత షాకిస్తోంది ఈ షో అభిమాన వర్గానికి. మరోవైపు హైపర్ ఆది కూడా జబర్ధస్త్ షో నుండి బయటకు వద్దామనుకున్నా.. లీగల్ సమస్యలతో ఆగిపోయాడు. మొత్తానికి జబర్ధస్త్ షో నుండి ఒక్కొక్కరుగా తప్పుకోవడం చేస్తుంటే ఇక ఈ షో కళ తప్పే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో జబర్దస్త్ నిర్వాహకులు వీరి స్థానాన్ని వేరే ఎవరితో అయినా ఫిల్ చేసి వావ్! అనిపిస్తారా? లేదా? అనేది చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here