అసెంబ్లీలో జగన్ సంచలన ప్రకటన.. షాక్‌లో ఏపీ ప్రజానీకం

0
83

అమరావతి: అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్‌ సంచలన ప్రకటన చేశారు. ఏపీకి బహుశా మూడు రాజధానులు రావొచ్చంటూ ప్రజానీకానికి షాక్ ఇచ్చారు. మూడు రాజధానులు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు జగన్ తేల్చి చెప్పారు. విశాఖ, కర్నూలు, అమరావతిలను ఏపీకి రాజధానులుగా మార్చే ఆలోచన చేస్తున్నట్టు ప్రకటించారు.

దక్షిణాఫ్రికాకు సైతం మూడు రాజధానులున్నాయని.. మనమూ మారాల్సిన అవసరముందని జగన్‌ పేర్కొన్నారు. పాలనా రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, చట్టసభల కోసం అమరావతిలను రాజధానులుగా వినియోగించనున్నట్టు ప్రకటించారు.

కమిటీల నివేదికలు చూసి నిర్ణయం తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు. అమరావతినే రాజధానిగా చేయాలని తనకూ ఉందని.. కానీ లక్షల కోట్లు తెచ్చేదెలా? అని ప్రశ్నించారు. విశాఖపట్నం అయితే ఖర్చుండదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ రావొచ్చన్నారు. వారంలోపు నిపుణుల కమిటీ నివేదిక వస్తుందని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here