Official: ఒలింపిక్ మెడల్ సాధించిన భారతీయ తొలి మహిళ.. కరణం మల్లీశ్వరి బయోపిక్.!

7
487

ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ హవా నడుస్తోంది. మొన్న అన్న నందమూరి తారక రామారావు.. నిన్న అమ్మ జయలలిత.. నేడు ఒలింపిక్ మెడల్ సాధించిన భారతీయ తొలి మహిళ.. కరణం మల్లీశ్వరి బయోపిక్ త్వరలో మన ముందుకు రాబోతోంది. వివరాల్లోకి వెళ్తే..

ప్రముఖ ప్రొడ్యూసర్ కోన వెంకట్.. వెయిట్ లిఫ్టింగ్ లో ఒలింపిక్ కాంస్య పతకాన్ని సాధించిన భారతీయ తొలి మహిళ.. కరణం మల్లీశ్వరి జీవిత కథ ఆధారంగా బయోపిక్ ను తీయనున్నట్లు జూన్ 1 న కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్బంగా అధికారికంగా ప్రకటించారు. దీనికి సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సంజనా రెడ్డి చాలా రీసెర్చ్ చేసి కరణం మల్లీశ్వరి గురించి అన్ని విషయాలను తెలుసుకున్నారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించాలని సంజనా రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.

కరణం మల్లీశ్వరి జూన్ 1, 1975 న ఆంధ్రప్రదేశ్ లోని ఊసవానిపేటలో జన్మించారు. 1995 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని మరియు 1999 లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. 2000 లో సిడ్నీ ఒలింపిక్స్ లో.. కరణం మల్లీశ్వరి స్నాచ్‌లో 110 కిలోలు క్లీన్ అండ్ జెర్క్ విభాగాలలో 130 కిలోలు మొత్తం 240 కిలోలను ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది తద్వారా ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది.

ప్రస్తుతం కోన వెంకట్ నిర్మించిన ‘నిశ్శబ్దం’ చిత్రం లాక్ డౌన్ పూర్తైన తర్వాత విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అనుష్క శెట్టి మరియు మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here