Karthika Deepam డిసెంబర్ 18 ఎపిసోడ్: కార్తీక్ దీపలు త్వరలోనే విడాకులు.. షాక్ లో సౌర్య..

0
209

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

సరోజక్క.. మరిది లక్ష్మణ్ తో నువ్వు బరువు మొయొద్దు అని డాక్టర్ బాబు చెప్పారుకదా.. వద్దులే అని అంటుంది. ఇంతలో సరోజక్క భర్త వచ్చి వాళ్ళిందరికి అక్రమ సంభందం కడుతాడు. సరోజక్క గురించి చాలా నీచంగా మాట్లాడుతాడు.. అదంతా విన్న కార్తీక్ ఆవేశంగా వచ్చి దేవతలాంటి భార్యమీద నిందలు వేస్తావా.. అంటూ వాడిని తిట్టి పంపిస్తాడు. దీప అదంతా చూసి సంతోష పడుతుంది.

ఈ రోజు డిసెంబర్ 18 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

సౌందర్య కార్తీక్ దగ్గరకు వచ్చి అరేయ్ పెద్దోడా.. సరోజక్క భర్త ఆమెను అనుమానించి. వమానిస్తుంటే.. నీలోని ఒక సంస్కార వంతుడికి సహనం నశించిపోయింది చూసావా అది నాకు బాగా నచిందిరా.. ఒక పరాయి స్త్రీ మీద ఆమె భర్త నిండా వేస్తేనే నీలో ఇంత ఆవేశం వెల్లువెక్కిందే.. ఆ సరోజక్క లాంటిదే కదరా దీప. దానిని ఎందుకురా నుమానిస్తున్నావ్ రా.. అంటుంది సౌందర్య. దానికి కార్తీక్ నిను దీపని అనుమంచాలేదు మమ్మి.. నేను చుసిన నిజాన్ని నమ్మి, నాలో ఉన్న లోపాన్ని నమ్మి దూరంగా ఉన్నాను.

మీరంతా ఒక భ్రమలో ఉన్నారు.. నాది అనుమానం అనుకుంటున్నారు. కానీ నాది అనుమానం కాదు నిజం అంటాడు కార్తీక్ . నీ నిజం నా అనుభవానీకెందుకు అబధం అనిపిస్తుందిరా.. అంటుంది సౌందర్య. నిను దీపను చాలా అభిమానించని కానీ ఆ నమ్మకాన్ని ముక్కలు చేసింది కాబట్టే దూరం చేసుకున్నాను అంటాడు కార్తీక్. ఇంతలో సౌర్య నానమ్మ అని దగ్గరకు వెళ్లి మాకెవరు లేరు.. ఇవాళ మీరందరు వస్తే చాలా సంతోషంగా ఉందొ తెలుసా.. నాకు అందరు ఉన్నట్టు అనిపిసరుతుంది. మల్లి మీరు వెళ్ళిపోతే అమ్మ నిను వంటరిగానే ఉంటాం.. మనందరం కలిసి భోజనం చేదాం రండి.. అంటూ భాదగా చెబుతుంది సౌర్య.

సరోజక్క ఆమె భర్త కావాలనే ఆలా చేసారని దీపకు చెప్తారు. కార్తీక్ మారుతాడేమో దీపని అనుమానించకుండా తీసుకెళ్తాడేమో అని ఆల్ చేసారు. ఇక మౌనిత రగిలిపోతూ ఉంటుంది. ప్రియమణి వచ్చి మల్లి వండమంటారా అమ్మ అని ఆడుకుతుంది. నాకు అన్నం వద్దు.. దీప పతనం కావాలి.. అంటూ మండిపోతుంది మౌనిత.

దీప ఇంట్లో అంతా కలిసి తింటుంటారు. దీప వడ్డిస్తుంది. ఆదిత్య వీడియో తీస్తాడు. దీప కార్తీక్ కి వడ్డిస్తుంది. చాలు చాలు అంటాడు. అది చూసి అందరు సంతోషిస్తారు.

కార్తీక్ చేయి కడుక్కోవడానికి వెళ్తే.. దీప నీళ్లు ఇస్తూ మీరు నిజంగా దేవుడు డాక్టర్ బాబు. సరోజక్కని మీరు కొన్ని సర్లే చూసారు. నేను మీతో కాపురం చేశాను.. మరి నన్నెందుకు అర్ధం చేసుకోవడం లేదు డాక్టర్ బాబూ అని దీప అనగానే.. నేను ఎదో పిల్లల మనసు నొప్పించకూడదని నీ ఇంట్లో తినడానికి ఒప్పుకున్నాను.. నిన్ను క్షమించానని సంబరపడకు. రెండో మూడు రోజుల్లో నీకు విడాకుల నోటీసు వస్తుంది సంతకం చేయకపోయినా విడాకులు వస్తాయ్.. ఈ విషయం మావాళ్లకి చెప్పకు.. వాళ్లకు చెప్పిన నేను వినను.. అనవసరంగా మాకు మాకు గొడవలవుతాయ్.. అంటాడు కార్తీక్. ఇదంతా సౌర్య విని షాక్ అవుతుంది. దీప ఏడుస్తుంది.

సౌర్య ఒక్కతే కూర్చొని కార్తీక్ దీపకు విడాకులు ఇస్తానన్న విషయం గురించి ఆలోచిస్తుంది. ఇంతలో హిమ వచ్చి వంటలక్కకి మా డాడీని పెళ్లి సి చేసుకోవడం ఇష్టమే అనిపిస్తుంది అంటుంది. మీ డాడీకి మా అమ్మని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనిపిస్తుంది అంటుంది సౌర్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here