Karthika Deepam ఫిబ్రవరి 14 ఎపిసోడ్: మౌనితకు గిఫ్ట్ ఇచ్చిన కార్తీక్.. సంతోషం ఆపుకోలేక అలా అనేసింది..

0
715

గత ఎపిసోడ్ లో ఏం జరిగినదంటే..

కార్తీక్, దీప స్కూల్ కి వస్తారు. కార్తీక్ ని చూసిన దీప మౌనిత అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. దీపను చూసిన కార్తీక్ సౌర్యకు నేనే తండ్రినని చెప్పేసిందేమో అడగాలి అనుకోని మల్లి వెంటనే వద్దులే అడిగితే చెట్టు ఎక్కి కూర్చుంటుంది. అసలే టెక్కు ఎక్కవ దీనికి అనుకుంటూ కోపంగా దీప వైపు చూస్తాడు. ఈ డాక్టర్ బాబుకి సమయం సందర్భం లేకుండా కోపం వచ్చేస్తుంది. ఎందుకో అంత గుర్రుగా చూస్తున్నాడు అనుకుంటుంది. ఇద్దరు చెరొకవైపు ఎవరి ఆలోచనలో వారు ముందుకు నడుస్తారు. వెళ్లిదరిని హిమ, సౌర్య చూస్తారు.

ఈ రోజు ఫిబ్రవరి 14 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

దీపని కార్తీక్ ని హిమ, సౌర్య చూస్తారు. హిమ వాళ్ళదగ్గరకి వెళ్లబోతుంటే సౌర్య వద్దుఅని ఆపి మనం వెళితే వేరువేరుగా వెళ్ళాలి. వాళ్లిదరు కలిసి వస్తే మనం కలిసి వెళ్లొచ్చు అంటుంది. సరే అని ఇద్దరు వచ్చాక కార్తీక్ బాక్స్ ఇచ్చి వెళ్లబోతుంటే హిమ ఆపి అందరం కలిసే కూర్చుందాం అంటుంది. నాకు పనుంది నిను వెళ్తాను అని చెప్తాడు కార్తీక్.

ఇంతలో హిమ వంటలక్క.. సౌర్యదంత వాళ్ళ నాన్న పోలికంటకదా సౌర్య చెప్పింది అంటుంది హిమ. పోలికలన్నీ వాళ్ళ నానమ్మవి. బుద్ధులే వాళ్ళ నాన్నవి అంటుంది దీప. వాళ్ళ నాన్న లాగే మూర్ఖంగా మాట్లాడుతుందని నువ్వే చెప్పావంట కదా సౌర్య చెప్పింది అంటుంది హిమ. దీప షాక్ అవుతుంది. కార్తీక్ దీపను కోపంగా చూస్తాడు. నిను వెళ్తాను హిమ బాయ్ అని చెప్పి కార్తీక్ బయలుదేరుతాడు. సౌర్య కూడా బాయ్ డాక్టర్ బాబూ.. అని చెప్పడంతో కార్తీక్ మళ్ళీ దీప వైపు కోపంగా చేసి వెళ్తాడు.

కార్తీక్ కారు దగ్గరకు వెళ్లి ఈ వంటలక్క కచ్చితంగా డాక్టర్ బాబే మీ నాన్న అని చెప్పి ఉంటుంది. అందుకే నేను చెప్పకపోయినా బాయ్ చెప్పింది అనుకోని కారులో నుండి బుక్ పెన్ తీసుకొని వంటలక్క నీకు వంట్లో బాలేదని సౌర్య చెప్పింది. మందులు రాసిస్తాను రా.. అంటాడు కార్తీక్. దీప కార్తీక్ దగ్గరకు వెళ్లి నాకు వంట్లో బానే ఉంది. శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్లాలని సౌర్య కి అబద్ధం చెప్పను వంట్లో బాలేదని అంటుంది. కనిపిస్తూనే ఉన్నవ్గా దుక్క లాగా అంటాడు కార్తీక్. ఆ సీన్ బలే కామెడీగా ఉంటుంది.

ఎందుకు పిలిచారు తిట్టడానికా అంటుంది దీప. నీ కూతురికి ఎం చెప్పావ్..? అంటాడు కార్తీక్. నేనేం చెప్పాను అంటుంది దీప. దాని పోరు పడలేక డాక్టర్ బాబే మీ నాన్న అని చెప్పేసావా అని అడుగుతాడు కార్తీక్. ఇంకా చెప్పలేదు డాక్టర్ బాబూ.. చెప్పనా అంటుంది దీప అమాయకంగా ముఖం పెట్టి. పళ్ళు రాలుతాయ్ అంటాడు కార్తీక్. అసలు మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది అంటుంది దీప. ఇంతకు ముందు నాన్న నాన్న అని అడిగేది. ఎప్పుడు అడగట్లేదు అందుకు.. అంటాడు కార్తీక్. ఏం చేస్తుంది పాపం దాని నాన్న రాయని, రాడని, కసాయి తండ్రని, ఆఖరికి ఒక మూర్కుడని.. ఛి ఛి నిను చెప్పలేదు. దానికే తెలిసిపోయినట్టుంది అంటుంది దీప.

ఈ మాట మీ అత్తగారే పుట్టించింది కదా అంటాడు కార్తీక్. మీ తోనే అన్నారుగా అంటుంది దీప. ఛి ఛి నిన్ను పిలిచి తప్పుచేసాను అంటాడు కార్తీక్. మందులు రాసివ్వండి లేదంటే అక్కడ ఒక సిఐడి, ఒక డిటెక్టివ్ ఉన్నారు అంటుంది దీప. కార్తీక్ మందులు రాస్తుంటే దీప కామెడీగా మొకం పెట్టి చూస్తుంది. ఏంటి ఇలా గీకేసారు. మెడికల్ షాప్ అతనికయినా అర్ధమవుతుందా అంటుంది దీప. ఏ నీకు లేని రోగం మల్లి వస్తుందా.. పోవే.. పో అని వెళ్ళిపోతాడు కార్తీక్ దీప మురిసిపోతూ వెళ్ళిపోతుంది.

ఇక మౌనిత ఎదో బుక్ చదువుతుంటే.. ప్రియమణి కూరగాయలు కట్ చేస్తూ.. అమ్మ నీకు ఎప్పుడైనా కార్తీక్ ముద్దు పెట్టాడా అంటుంది. మౌనిత షాక్ అవుతుంది. అదేంటమ్మా ఆలా షాక్ అయ్యావ్.. ఇంత కాలం అతను ఒక్కసారి కూడా.. అని ప్రియమణి అంటుంటే.. ఎహె.. ఆపవే వెదవ మాటలు నువ్వును అంటుంది మౌనిత. సరే సరేలే గని కార్తికయ్యను గ్రిప్ లో పెట్టేందుకు ఏం ప్లాన్ వేసారో చెప్పండి అంటుంది ప్రియమణి.

కార్తీక్ ని నాకో డ్రెస్ కొనుక్కురమ్మని చెప్పాను. తెస్తే మన గ్రిప్ లోకి వచ్చినట్టే అంటుంది. ఆయన ఎప్పుడు తేవాలి అని లోపలి వెళ్ళిపోతుంది ప్రియమణి. మౌనిత టెంక్షన్ పడుతుంది. కార్తీక్ డ్రెస్ తీసుకురాడా.. అని. ఇంతలో కార్తీక్ డ్రెస్ తీసుకొని వస్తాడు. మౌనిత చాలా సంతోషపడుతుంది. నా సెలక్షన్ నీకు నచ్చుతుందో లేదో.. అంటాడు. చాలా చాలా బాగుంది అని ఆ ఆనందంలో థాంక్స్ ‘బంగారం’ అనేస్తుంది. అదేంటి కొత్తగా అంటాడు కార్తీక్. ఏంలేదులే చాలా బాగుంది కార్తీక్ అంటుంది మౌనిత. సరే నేను వెళ్ళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్.

ఇక సౌర్య చదువుకుంటుంది. మై నేమ్ ఐస్ సౌర్య. మై ఫాదర్ నేమ్ ఐస్ డాక్టర్ కార్తీక్. మై మదర్ నేమ్ ఐస్ దీప.. అంటూ చదువుతూ దీపతో అమ్మ హిమ వాళ్ళ అమ్మ ఎవరు? నాకు ఏమవుతుంది? అని అడుగుతుంది సౌర్య. మన భాగోతం పక్కన పెట్టి చదుకో అంటుంది దీప. నువ్వు చెప్పవ్.. నిన్ను అడగడం నాది బుద్దితక్కువ.. అని చెంప్పలు వేసుకొని అమ్మ వంటలక్క నిన్ను ఇంకోసారి అడిగితే చూడు.. నేను సరోజక్క వాళ్ళింటికి వెళ్లి రేపు వస్తాను అని దీప మీద అరిచి వెళ్లిపోతుంటే సౌందర్య ఎదురు పడుతుంది.

ఏంటక్కాయ్.. ఎర్ర మెరపకాయలాగా అయింది నీ ముక్కు. చార్మినార్ వెల్దామంటే మీ అమ్మ తిసుకేల్లనన్దా.. నేను తీసుకెళ్తాను అంటుంది. నాకు చార్మినార్, గోల్కొండ వేవి వద్దు. హిమ వాళ్ళ అమ్మ ఎవరో కావాలి అంటుంది సౌర్య. సౌందర్య షాక్ అవుతుంది. దీప వైపు చూస్తుంది. హిమ వాళ్ళ అమ్మ చచ్చిపోయాక.. అని సౌర్య అనడంతో ఆపవే అని సౌందర్య అంటుంది కోపంగా.. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఐపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here