Karthika Deepam ఫిబ్రవరి 13 ఎపిసోడ్: కార్తీక్ ముందు దీపను బుక్ చేసిన హిమ.. సౌర్య వాళ్ళ నాన్న మూర్ఖుడంట కదా..

0
990

గత ఎపిసోడ్ లో ఏం జరిగినదంటే..

మౌనిత దీపని ఇంటింటికీ తిరుగుతూ అన్నం అమ్ముకోవడం ఇంతే నీ పని.. అంటూ తిడుతూ ఉంటుంది. అదంతా విన్న సౌందర్య మౌనిత చెప్పా చెల్లుమనిపిస్తుంది. ఎవరిని ఏం అంటున్నావ్.. ఎవరు ఎక్కడుంటారని చెబుతున్నావ్.. నా కోడలు ఆత్మ గౌరవం ఉన్న ఆడది కాబట్టే ఒకరికి చేయి చంపకుండా.. అని చెప్పబోతుంటే వెంటనే మౌనిత దన్నం పెట్టి అమ్మ.. సౌందర్యమ్మ.. నీ కోడలు దండకం వినలేక చెవులు తూట్లు పడుతున్నాయ్. ఓకే.. సెల్ఫ్ రెస్పెక్ట్ కాదనను.. మరి మీరు ఆ రోజు హాస్పిటల్లో నా కోడలు అని ఎందుకు నోరు విప్పలేదు. వంటలక్క అనా.. మీ ఇమేజ్ పడిపోతుందనా.. అంటూ ఆవేశంగా ఊగిపోతుంది మౌనిత.

ఈ రోజు ఫిబ్రవరి 13 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

నీ కొడుకుని, ఈ వంటలక్కని పక్క పక్కన నిలబెట్టి అప్పుడు చెప్పండి నా కోడలని.. అంతే గాని నోరు ఉంది కదా అని తిట్టడం, చేయి ఉంది కదా అని కొట్టడం కర్రెక్ట్ కాదు అంటూ మౌనిత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దీప సౌందర్య అక్కడే నిలబడి ఒకరినొకరు చూసుకుంటారు.

కార్తీక్ కారులో వెళుతూ.. (స్కూల్ దగ్గర హిమను దింపినప్పుడు కార్తీక్ సౌర్యను మూర్ఖులు అంతే.. హిమా.. అంటాడు. వెంటనే సౌర్య నేను మా నాన్న పోలిక.. హా నేను మా నాన్నలానే మాట్లాడతానట. మా అమ్మ చెప్పింది అంటుంది సౌర్య నవ్వుతూ కావాలనే.) ఈ మాటలు తలుచుకుంటూ.. ఏంటి ఇది అంత మాట అనేసింది. ఈ రౌడీ నన్ను ఉద్దేశించి అందా.. అది వాళ్ళ నాన్న కోసం పిచ్చిదానిలా తిరిగేది. ఉన్నటుంది ఆ రౌడీలో(సౌర్య) ఎంత మార్పు. దాని చూపులు మాటలు తేడాగానే ఉంది. ఆ దీప నేను దాని తండ్రినని చెప్పేసిందా ఏంటి కనుక్కోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు.

సౌందర్య, దీప కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్నంటే నాకే అంత కోపం వచ్చింది. మరి నీకెందుకు రాలేదే అంటుంది సౌందర్య. నడి బజారులో మాటలాడగలిగే ఆడదానితో.. నడి బజారులో నిలబడి గొడవపెట్టుకుంటే ఏమౌతుంది అత్తయ్య. నేను ఆ ఇంట్లో లేకపోయినా.. మీ కోడలిగా.. ఆయన భార్యగానే ఉన్నాను. మన కుటుంభం పరువు నేనెలా తీస్తాను. ఆ మౌనిత నన్ను చూస్తేనే భయపడేలా చేయగలను. కానీ అలా చెయ్యలేను అంటుంది దీప.

ఆ మాటలకూ సౌందర్య దీప చేతిని తీసుకోని నిమురుతూ.. నిజంగా మీము చాలా అదృష్టవంతులమే దీప. నువ్వు మా కోడలివి అయినందుకు. మొగుడు ముద్దుగా మొట్టికాయ వేస్తే కోర్టుకు వెళ్లే ఆడవాళ్లు ఉన్నారు ఈ రోజుల్లో. వాడు నిన్నుఎంతగా అవమానించిన నీలో నువ్వే కుమిలిపోతున్నవే తప్ప ఏనాడూ ఎదురించలేదు. మన కుటుంబం పరువు కాపాడుకుంటూ వస్తున్నావు.

నిజంగా నువ్వు నా బంగారానివే అంటూ దీప చేతులకు సౌందర్య గట్టిగా ముద్దు పెడుతుంది. దాంతో దీప చాలా సంబరపడిపోతుంది. నేను ఎంతగా నాలో నేనే దాచుకున్న సౌర్య మాత్రం వదిలేలాలేదు అత్తయ్య.. అంటూ సౌర్య గురించి చెపుతుంది దీప. నువ్వేం భయపడకు వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అని దీపకు ధైర్యం చెప్తుంది సౌందర్య.

ఇక స్కూల్లో సౌర్య, హిమ ఇంకొంత మంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. టీచర్ వచ్చి అందరిని పిలిచి మార్చ్ 8న ఉమెన్స్ డే ఆ రోజు మీ అమ్మలను తీసుకురావాలి అని ఒక్కొక్కరి నేమ్స్ రాసుకుంటుంది. హిమ మీ అమ్మ పేరు చెప్పు అని అడిగిన టీచర్ తో హిమ మా అమ్మ చచ్చిపోయింది అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు సౌర్య మా అమ్మ పేరు రాసుకోండి. మా అమ్మ హిమను కూడా నాలగే చూసుకుంటుంది అంటుంది.

ఇంటికి వెళ్లిన మౌనిత ఆ దీప ఏం పుణ్యం చేసుకుంది నేనేం పాపం చేశాను. ఆ దీప అంటే అందరికి ఇష్టమే. అందరు ఆ దీప మంచి కోరుకునే వారే.. ఆ సౌందర్య దీప కలిసి నా రెండు చెంపలు పగలకొట్టిన పర్వాలేదు కానీ నా నమ్మకం మీద దెబ్బ కొట్టకూడదు అంటూ రగిలిపోతుంది మౌనిత, కూరగాయలు తరుముతున్న ప్రియమణి మీకు వేరే ఎవరితో పనేంటమ్మ.. మీకు కావాల్సింది కార్తికయ్య. కార్తికయ్యని గుప్పిట్లో పెట్టుకుంటే ఆ అత్తాకోడళ్లు మిమ్మల్ని ఏం చేయగలరమ్మ అంటుంది. దాంతో మౌనిత మురిసిపోతుంది.

కార్తీక్, దీప స్కూల్ కి వస్తారు. కార్తీక్ ని చూసిన దీప మౌనిత అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. దీపను చూసిన కార్తీక్ సౌర్యకు నేనే తండ్రినని చెప్పేసిందేమో అడగాలి అనుకోని మల్లి వెంటనే వద్దులే అడిగితే చెట్టు ఎక్కి కూర్చుంటుంది. అసలే టెక్కు ఎక్కవ దీనికి అనుకుంటూ కోపంగా దీప వైపు చూస్తాడు. ఈ డాక్టర్ బాబుకి సమయం సందర్భం లేకుండా కోపం వచ్చేస్తుంది. ఎందుకో అంత గుర్రుగా చూస్తున్నాడు అనుకుంటుంది. ఇద్దరు చెరొకవైపు ఎవరి ఆలోచనలో వారు ముందుకు నడుస్తారు. వెళ్లిదరిని హిమ, సౌర్య చూస్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఐపోయింది.

నెక్స్ట్ ఎపిసోడ్ లో..

వంటలక్క.. సౌర్యదంత వాళ్ళ నాన్న పోలికంటకదా సౌర్య చెప్పింది అంటుంది హిమ. పోలికలన్నీ వాళ్ళ నానమ్మవి. బుద్ధులే వాళ్ళ నాన్నవి అంటుంది దీప. వాళ్ళ నాన్న లాగే మూర్ఖంగా మాట్లాడుతుందని నువ్వే చెప్పావంట కదా సౌర్య చెప్పింది అంటుంది హిమ. దీప షాక్ అవుతుంది. కార్తీక్ కోపంగా చూస్తాడు దీప వైపు. హిమ, సౌర్య అక్కడి నుండి వెళ్లడంతో కార్తీక్ దీపతో సౌర్యకు వాళ్ళ నాన్నని నేనే అని చెప్పేసావా అని అడుగుతాడు. ఇంకా చెప్పలేదు డాక్టర్ బాబు అయినా మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది అంటుంది దీప అమాయకంగా ముఖం పెట్టి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here