Karthika Deepam ఫిబ్రవరి 28 ఎపిసోడ్: ఆనందంలో కార్తీక్, హిమ.. కోపంతో రగిలిపోతున్న మౌనిత..

0
642

గత ఎపిసోడ్ లో ఏం జరిగినదంటే..

దీప హిమనీ పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతుంది. ఇక సౌర్య కార్తీక్ వినాలని సరోజక్క, వారణాసి, లక్ష్మణ్ మామ అందరు విష్ చేసారు అంటుంది. కార్తీక్ నవ్వుతూ సౌర్య కి విష్ చేసి కౌగిలించుకుంటాడు. సౌర్య చాలా సంతోషపడుతుంది. హిమ, సౌర్య ముందుకు నడుస్తారు. వెనకాలే దీప, కార్తీక్ వస్తారు. పిల్లలందరూ హిమకి సౌర్యకి పూలతో స్వాగతం పలుకుతారు. పిల్లల వెనకాల నుండి సౌందర్య వచ్చి హిమ, సౌర్యలకి విషెస్ చెప్తుంది.

పక్కనే ఉన్న కార్తీక్ ఏంటి నానమ్మగారు రాత్రి ఆనందరావుతో కలిసి చేసిన సెలబ్రేషన్తో తృప్తి చెందలేదా అని సౌందర్య కు కాస్త దగ్గరగా వచ్చి అంటాడు. పిల్లలిద్దరూ మురిసిపోయి సంబరపడిపోవాలంటే ఇలాంటి చిన్న చిన్న త్రిల్స్ ముఖ్యం కదరా. అంటుంది సౌందర్య నవ్వుతూ..

ఈ రోజు ఫిబ్రవరి 28 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

ఇది కాదు త్రిల్.. ఈవెనింగ్ నేను ఇస్తా.. అందరికి అసలైన త్రిల్లు అంటాడు కార్తీక్ నవ్వుతూనే.. అదేంటో చెప్పరా.. అంటుంది సౌందర్య. నీను చెప్తా.. దానికన్నా ముందు వంటలక్కకి ఒకటి చెప్పాలి. వంటలక్క సాయంత్రం డాడీ ఇచ్చే సర్ప్రైజ్ పార్టీకి నువ్వు, సౌర్య తప్పకుండ రావాలి. సౌర్య కూడా అక్కడే కేక్ కట్ చేస్తుంది. డాడీ మీ అందరిని పిలువమన్నాడు. వారణాసి నిన్ను కూడా అంటుంది హిమ.

ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటో అంటుంది సౌందర్య. నీను చెప్తా అని హిమ అనడంతో.. లేదు నీనే చెప్తా. ఈ ఒక్కటి నా నోటితో నీనే చెప్పాలమ్మా.. అంటాడు కార్తీక్. సరే అంటుంది హిమ. వంటలక్క సాయంత్రం పార్టీకి నువ్వు, తప్పకుండ రండి. పార్టీ మిస్ అయితే చాలా మిస్ అయిపోతావ్.. రౌడీని, సరోజక్కని, వారణాసికి, అంతెందుకు మీ శ్రీరామ్ నగర్ పాస్తీ మొత్తాన్ని తీసుకొచ్చిన చాలా బాగా రిసీవ్ చేసుకుంటాను అంటాడు కార్తీక్. ఇంతకీ మమ్మల్నందరిని ఎందుకు ప్రత్యేకంగా రమ్మంటున్నారు డాక్టర్ బాబు అని అడుగుతుంది దీప టెన్షన్‌గా.

హిమ అడిగే ప్రశ్నలకీ.. ఈ రౌడీ కూడా అడిగే ప్రశ్నలకీ.. అన్నింటికీ కలిపి సమాధానం చెప్పబోతున్నాను.. అదేంటంటే.. సాయంత్రం హిమకి వాళ్ల అమ్మ ఎవరనేది చూపించబోతున్నాను అంటాడు కార్తీక్ నవ్వుతూనే. దీప, సౌందర్య, సౌర్య షాక్ అవుతారు. అవును నానమ్మ.. కారులో వచ్చేప్పుడు అమ్మని చూపించమంటే సాయంత్రం పార్టీలో చూపిస్తా అన్నారు డాడీ అంటుంది హిమ.

ఏమే రౌడీ హిమ వాళ్ళ అమ్మ గురించి నన్ను చాలా సార్లు అడిగి చంపే దానివికదా.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావ్.. సాయంత్రం తప్పకుండ మీ అమ్మతో కలిసి తప్పకుండా రా అంటాడు కార్తీక్. హిమ వాళ్ళ అమ్మని నీనే అని తెలిసిపోయిందా అందుకే తప్పకుండ రమ్మంటున్నాడా.. అనుకుంటుంది దీప మనసులో. అందరు తప్పకుండ పరికి రమ్మని చెప్పి కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సౌందర్య, దీప ఆలోచనలో పడుతారు.

కార్తీక్ వెళ్ళాకా.. సౌందర్య, దీప అక్కడే ఓ చెట్టుకింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. హిమ వాళ్ళ అమ్మ చచ్చిపోయిందని చెప్పి ఎప్పుడు పుట్టుకొస్తుంది అనడం ఏంటి? ఎవరిని తీసుకొస్తాడు? ఎవరిని చూపిస్తాడు అంటూ దీప టెంక్షన్ పడుతూ సౌందర్యంతో అంటుంది. కార్తీక్ హిమతో పాటు మౌనితకు డ్రెస్ తెచ్చింది గుర్తుకొచ్చిన సౌందర్య లేచి కొంపతీసి ఆ మౌనితను తీసుకొచ్చి ఇదే మీ అమ్మ అంటాడా ఏంటి నా వింత పుత్రుడు అనుకుంటుంది.

ఏమైనా తట్టింది అత్తయ్య అంటుంది దీప. లేదు అని తలా ఊపుతుంది సౌందర్య. దీప సంతోషంతో ఇంకెవరుంటారు నీనే కదా అత్తయ్య.. హిమనీ అమ్మలా చూసుకుంటున్నాను కదా.. హిమ కూడా నన్ను డాక్టర్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది కదా.. నన్నే చూపిస్తారా.. నీనే హిమ వాళ్ళ అమ్మనని చెప్తారా.. నేను తప్పితే ఇంకెవరున్నారు. ఏం మాట్లాడారేంటి అత్తయ్య అంటుంది నవ్వుతూ..

ఏం మాట్లాడమంటావే.. నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు వాడు నువ్వే హిమ వాళ్ళ అమ్మవని చెప్తాడా.. వాడు ఏ తలుపు తీరుస్తాడా.. అని భయపడుతున్నాను. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నటుండి. అన్ని ప్రశ్నలకు జవాబులు కరెక్టుగా రాసిన విద్యార్థిలా ఎంత ఆశగా ఎదురు చూస్తున్నవే.. అంటుంది సౌందర్య భాదగా..

ఆ మనసు నన్ను, నా ఆత్మ సౌందర్యాన్ని ప్రేమించిన మనసేగా.. ఇంతమంది మంది నా పవిత్రత గురించి మంచిగా అనుకుంటుంటే తనొక్కడే ఎందుకు అనుమానించాలి అనుకోని ఉండొచ్చు కదా.. లేదంటే నిజంగా హిమకి తల్లిని ఇవ్వాలని ఎవరో ఎందుకు ఈ వంటలక్కే మీ అమ్మ అని చెప్పాలనుకొని ఉండొచ్చుకదా.. అంటుంది దీప ఆశగా. దీపా నువ్విలా ఒక్కో ఇటుక పేర్చుకుని కోటని పేర్చుకుంటున్నావేమోనే.. పునాది లేని.. కోటని ఇవాళ వాడు కూలిస్తే నువ్వేమైపోతావో.. నిన్ను చూసి నా గుండె ఎన్ని ముక్కలవుతుందో అని ఏడుస్తుంది సౌందర్య.

పిల్లలు మిమ్మని కలపాలన్న వాడు కావలేక పోతున్నాడు అంటుంది సౌందర్య భాదగా. పార్టీకి వస్తాను అత్తయ్య. వంటలక్కలా వస్తాను. నా నా రెండో బిడ్డ పుట్టిన రోజు ఎంత ఘనంగా జరగబోతుందో చూడటానికైనా వస్తాను. గుండెను రాయిగా మార్చుకుంటే మనిషికి ఎంత హాయిగా ఉంటుందో ఆ రాయిగానే వస్తాను.. అంటుంది దీప. దీప మాటలకు సౌందర్య బాధపడుతుంది.

మురళీకృష్ణ చాలా సంతోషన్గా వచ్చి భాగ్యం బిర్యానీ, పాయసం చేయి సౌర్య బర్త్ డే కదా తీసుకెళ్లి ఇస్తాను అంటాడు. ఇంతలో శ్రావ్య , ఆదిత్య వచ్చి అవసరం లేదు మామయ్య. ఇవాళ హిమ బర్త్ కూడా ఇవాళే కదా.. వదిన్ని, సౌర్యని కూడా మా ఇంటికే రమ్మన్నాడంట అన్నయ్య.. అన్నయ్యే వాళ్ళని పార్టీకి రమ్మని అన్నయ్యే స్వయంగా పిలిచాడట.. అంటాడు ఆదిత్య. మురళి కృష్ణ , శ్రావ్య నిజంగానే అనడంతో.. ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు అంటాడు. వంటలక్కని డాక్టర్ బాబు పార్టీకి రమ్మనిపిలివడం మాటలా బాబూ.. అంటుంది భాగ్యం.

ఆదిత్య నిజమా అంటుంది శ్రావ్య. అవును అమ్మ చెప్పింది. ఇంకో విషయం కూడా చెప్పింది హిమ వాళ్ళ అమ్మ ఎవరు అని అడుగుతుంది కదా.. అందుకే ఇవాళ బర్త్ డే గిఫ్ట్ గా.. హిమ వాళ్ల అమ్మని చూపిస్తానన్నాడట.. అంటాడు ఆదిత్య. దాంతో అంతా షాక్ అవుతారు. హిమ అనాధ కదా కదా ఎలాచూపిస్తాడు అంటుంది భాగ్యం. అంటే బావగారు దీపక్కని చూపిస్తాడా అంటుంది శ్రావ్య. వదినని భార్యగానే ఒప్పుకొని వాడు.. హిమకి తల్లి అని ఎలా చూపిస్తాడు అంటాడు ఆదిత్య. మరి బావగారు పనిగట్టుకొని వెళ్లి దీపక్కని ఎందుకు రమ్మంటాడు అంటుంది శ్రావ్య.

సౌర్య ఓ పక్కన నిలబడి కార్తీక్ మాటలను తలుచుకుంటూ ఉంటుంది. ఇంతలో హిమ అక్కడికి వస్తుంది. సౌర్య హిమతో.. ‘మా నాన్న నిజంగానే మీ అమ్మని చుపిస్తానన్నాడా.. అంటుంది సౌర్య. మా డాడీ ఎప్పుడు అబద్దం చెప్పరు సౌర్య అంటుంది హిమ. ఎక్కడుందంట మీ అమ్మ.. మరి మీ అమ్మ చనిపోయిందని ఎందుకు చెప్పాడు? అంటుంది సౌర్య. ఏమో నీను అడగలేదు అంటుంది హిమ.

హిమ వాళ్ళ అమ్మని తీసుకొస్తే మా అమ్మని ఎప్పటికి ఆ ఇంటికి తీసుకెళ్ళడా.. ఇద్దరు ఎప్పటికి కలిసిపోరా.. అందుకేనా అమ్మ నానమ్మ అంత టెన్షన్ గా ఉన్నారు. హిమ వాళ్ళ అమ్మ వస్తే.. మా అమ్మ ఎప్పటికి దూరంగానే ఉండిపోతుందా అని సౌర్య కూడా టెన్షన్ పడుతుంది.

కార్తీక్ స్టాఫ్ అందరికి బోనస్ ఇస్తాడు. ఏంటి సార్ స్పెషల్.. అంటే.. మా అమ్మయి బర్త్ డే అని చెబుతాడు. మరి ప్రతి బర్త్ డేకి బోనస్ ఇవ్వరు కదా సార్ అంటుంది ఓ డాక్టర్. ఇవ్వాలనిపించలేదు ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వాలనిపించింది ఇచ్చాను. వెళ్లి ఎంజాయ్ చేయండి అంటాడు కార్తీక్. ఇంతలో మౌనిత వస్తుంది. ఏంటీ అందరి ముఖాలు అలా వెలిగిపోతున్నాయి నీతో సహా? అంటుంది వెటకారంగా. వెంటనే కార్తీక్ నీ ముఖం ఎందుకు అలా వెలవెలబోతుంది? మా ముఖాలు చూసి?’ అంటాడు నవ్వుతూ.. మౌనిత కార్తీక్ వైపు కోపంగా చూస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఐపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here