‘Karthika Deepam’ జనవరి 13 ఎపిసోడ్: హిమ మిస్సింగ్.. కార్తీక్ ఏడుస్తూ కారులో అంతా వెతుకుతూ..

0
65

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

కార్తీక్ నాకు ఏది ఏమైనా విడాకులు కావాల్సిందే.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నా మనశాంతి కోసం విడాకులు కావాలి.. దీన్ని(దీప) స్కూల్ లో దించేయ్ నేను ఇక్కడే ఉంటాను అని సౌందర్యకి కారు కీస్ ఇస్తాడు కార్తీక్. దాంతో దీప ఏడుస్తూ.. రండి అత్తయ్యా.. ఆయన వినడు.. కలిసి వెళ్లి అందరం విడిపోదాం అంటుంది బాధగా..

ఈ రోజు జనవరి 13 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

కార్తీక్ హాస్పిటల్కి వెళ్లిన హిమ కార్తీక్ చైర్‌లో కూర్చుంటుంది. కార్తీక్ హాస్పిటల్కి వెళ్లే సరికి.. హిమని చూసి షాక్ అవుతాడు కార్తీక్. హిమా.. ఎలా వచ్చావ్.. నిన్ను ఎవరు తీసుకొచ్చారు. ఏంటమ్మా.. ఏం మాట్లాడవేంటీ.. అంటూ చాలా ప్రశ్నలు వేస్తాడు. హిమ మాత్రం ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తూ ఉంటుంది.

కార్తీక్ హిమతో ఎందుకు మాట్లాడట్లేదు అసలు అంటూనే.. నువ్వు మళ్లీ.. పెళ్లి చేసుకోవాలి డాడీ’ అని హిమ గతంలో అన్న మాటలు గుర్తుకొచ్చి.. అర్థమైంది.. డాడీ నువ్ మళ్ళి పెళ్లి చేసుకో అని చెప్పడానికి వచ్చావా.. అంటాడు కార్తీక్. విడాకులు తీసుకోవద్దని చెప్పడానికి వచ్చాను డాడీ అంటుంది హిమ. హిమ మాట్లకు కార్తీక్ మైండ్ బ్లాక్ అవుతుంది. అక్కడున్న నీళ్ల గ్లాస్ తీసుకుని నీళ్లు తాగుతాడు.

అమ్మ అంటే దీపనే కదా.. నువ్ అమ్మకు విడాకులు ఇవ్వొద్దు డాడీ.. అంటుంది హిమ. కార్తీక్ కి ఏం మాట్లాడాలో అర్ధం కాకా అలానే నిలబడతాడు. ఇంతలో నర్స్ పరుగున వచ్చి.. డాక్టర్.. ఐసీయూలో పేషెంట్ పరిస్థితి విషమంగా ఉంది మీరు వెంటనే రావాలి అంటుంది. కార్తీక్ నేను వస్తున్నాను నువ్ వేళ్ళు అంటాడు. హిమ ఇక్కడే ఉండు.. ఏం ఆలోచించకు అని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు.

కార్తీక్ ఐసీయూ లోంచి బయటికి రాగానే… ఇప్పుడు హిమకి ఏం సమాధానం చెప్పాలి.. అనుకుంటూ దీపకు కాల్ చేస్తాడు. దీపను తిడుతాడు. హిమకు విడాకుల గురించి ఎందుకు చెప్పావ్.. అంటూ తిడుతాడు. దీప మాత్రం నేను చెప్పలేదు అత్తయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను, అయినా ఈ విషయం నన్నడగటం కంటే హిమనీ అడుగు. అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.

ఇంట్లోకి వెళ్లిన దీప సౌర్య మీద అరుస్తుంది. హిమకు మీ డాడీ మీ అమ్మకు విడాకులు ఇస్తున్నాడు అని ఎందుకు చెప్పావ్ అని సౌర్యాని తిడుతుంది. నేను చెప్పడమేంటి నేను చెప్పలేదు. ఆ డాక్టర్ బాబు చెప్పాడా నేను చెప్పానని.. ఉండు ఇప్పుడే కాల్ చేసి అడుగుతాను అని కార్తీక్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది సౌర్య. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఐపోతుంది.

నెక్స్ట్ ఎపిసోడ్ లో..

కార్తీక్ దీపతో మాట్లాడి లోపలికి వచ్చేసరికి అక్కడ హిమ కనిపించదు. సౌందర్యకు ఫోన్ చేసి హిమ ఎక్కడుందో తెలుసా.. అని అడుగుతాడు. అదేంట్రా స్కూల్ నుంచి దాన్ని నువ్ తీసుకెళ్లలేదా.. అంటుంది సౌందర్య. కార్తీక్ వెంటనే దీపకు ఫోన్ చేస్తే.. చాలా కంగారు పడుతూ.. ఏంటీ.. వంటరిగా వచ్చి వంటరిగా వెళ్లిందా.. ఏమైనది డాక్టర్ బాబు.. ఇంటి దగ్గర కూడా లేదా.. అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. కార్తీక్.. నా కూతురు గురించి నువ్వేం ఓవర్ యాక్షన్ చెయ్యక్కర్లేదు.. నేను వెతుక్కోగలను అని ఫోన్ కట్ చేస్తాడు. దీప చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. కార్తీక్ ఏడుస్తూ కారులో అంతా వెతుకుతూ ఉంటాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here