Karthika Deepam నవంబర్28 ఎపిసోడ్: కార్తీక్ మౌనిత భార్య భర్తల కలిసి…ఒకరికొకరు

0
69

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

సరోజక్క దీప దగ్గరకు ఎవరికో గుండెపోటు వచ్చిందని ఆపరేషన్ చేయాలనీ నీదగ్గర డబ్బులుంటే ఇవ్వమని అంటుంది. దీప ఉన్నవన్నీ చీటి కట్టాను సరోజక్క ఎప్పుడెలా.. సరే స్కూల్లో అడ్వాన్స్ తీసుకుంటాను అని చెబుతుంది. అది విన్న సౌర్య ఎందుకమ్మా.. నానమ్మ, తాతయ్య, ఆదిత్య బాబాయ్ నువ్వు ఎంత అడిగిన ఇస్తారు కదా. లేకపోతే డాక్టర్ బాబూ చాల పేరున్న డాక్టర్ ఆయనకు మన పేరు చెబితే ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు కదా.. పద వెళ్దాం అని వారణాసిని పిలుస్తుంది. దీప, సరోజ ఎం చెప్పిన వినకుండా సౌర్య అతన్ని కార్తీక్ హాస్పిటల్ కి తీసుకెళ్తుంది.

ఈ రోజు నవంబర్ 28 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

పొద్దున్నే లేచి రెడీ అయి ఆఫీస్ కి వెళ్తున్న కార్తీక్ తో సౌందర్య గుడ్ మార్నిగ్ అని చెబుతుంది. కార్తీక్ మార్నింగ్ అంటాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య కొంచం ఘర్షణ జరుగుతుంది. ఇంతలో హిమ వచ్చి ఇంత పొద్దున్నే ఎక్కడికి డాడీ ఆఫీస్ కా అంటుంది అవునమ్మా. మధ్యాహ్నం నీకు లంచ్ బాక్స్ నేను తెస్తానులే.. అంటాడు కార్తీక్. వద్దు డాడీ ఈ రోజు వంటలక్కను తెమ్మంటాను, సౌర్య తో కలిసి తింటాను అంటుంది హిమ. వద్దు అంటాడు కార్తీక్. ఆ మౌనంత ఆంటీ లాగ ప్రియమణితో వండించదు. తానే స్వయంగా వండి తెస్తుంది. వంటలక్క చాల మంచిది డాడీ అని చెప్తుంది హిమ. సరే అంటాడు కార్తీక్.

ప్రియమణి మౌనితతో మీకు కర్రెక్ట్ టైం లో పెళ్లి అయి ఉంటె మెకోపిల్లాడు ఉండేవాడు. వాడికి తినిపించి, స్కూల్ కి రెడీ చేసి పంపిస్తూ ఉండేవారు అంటుంది. దానికి మౌనిత సాయంత్రం కాగానే పెళ్ళాం ల తయారయి మొగిడికోసం ఎదురు చూడటం నాకు నచ్చదు.

నాకయితే.. అని ఉహల్లోకి వెళ్ళిపోతుంది మౌనిత. కార్తీక్ మౌనిత భార్య భర్తల కలిసి ఇద్దరు ఒకరికొకరు అన్నం తినిపించుకుంటూ.. కార్తీక్ ఏమో నాకు హాస్పిటళ్లలో లేట్ అవుతుంది బంగారం అని చెప్పడం, మోనిత అవునా అయితే నేను హాస్పిటల్ కి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను డార్లింగ్. మనం లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం అంటూ చెబుతున్నట్టు ఊహల్లో కి వెళ్తుంది. ప్రియమణి మోనితను ఉహల్లొనుండి బయటకు తెచ్చి ఏంటి కార్తీక్ బాబుతో ఎక్కడికో వెళ్లి నట్టున్నారు అంటుంది.

కార్తీక్ హిమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సౌర,దీప, సరోజ వస్తారు. సరోజ వాళ్ళ చెల్లి భర్తకి గుండెపోటు వచ్చిందని మీరు చాల జాగ్రత్తగా చూస్తారని సౌర్య తీసుకొచ్చింది అని చెబుతుంది. సరే అని అతన్ని లోపలి తీసుకెళ్తు ఇదిగో వంటలక్క నువురా.. అంటాడు దీప లోపలి వెళ్తుంది. సౌర్య కూడా వెళ్లి డోర్ దగ్గర నిలబడి దీప కార్తీక్ మాట్లాడుకునేది వింటుంది. అది దీప కార్తీక్ గమనించారు.

దీపతో కార్తీక్ నానుంచి దూరంగా వెళ్ళమని చెబుతుంటే కావాలని దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నావేంటి. నీ కూతుర్ని కూడా నాకు దగ్గర చేస్తున్నావ్.. అది తండ్రికోసం పిచ్చిదానిలా రోడ్లమీద తిరుగుతుంటే ఆపకుండా వినోదం చూస్తున్నావ్, ఆ రౌడీకి నేనే తండ్రినని చెప్పవా.. అంటూ కార్తీక్ దీప ను అడుగుతాడు. లేదు డాక్టర్ బాబు నేనేమి చెప్పలేదు. మీతో ఒక్క మాట చెప్పాలి అంటుంది దీప. ఇంతలో నర్స్ వచ్చి సౌర్యని అక్కడ ఉండొద్దని చెప్పి పక్కకు పంపిస్తుంది. దీప కార్తీక్ తో నేను ఏమి అబద్దం చెప్పలేదు ఇంతవరకు.. అంటూ మాట్లాడుతుంది. సౌర్య అక్కడ కూర్చొని లోపల ఎం జరుగుతుందో అని టెంక్షన్ పడుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఐపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here