Karthika Deepam నవంబర్6 ఎపిసోడ్: బర్త్ సర్టిఫికెట్ ద్వారా సౌర్య వాళ్ళ నాన్నని కనుకుంటుందా..

0
205

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

సౌందర్య మోనిత పై వేసిన చురకలుకు ఆదిత్య, ఆనందరావులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సౌందర్యను పొగుడుతు ఉంటారు. సౌందర్య హిమ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య హిమ రావడం చూసి.. మమ్మి హిమ అంటాడు. వేంటనే సౌందర్య, ఆనందరావు.. సైలెంట్ అయిపోతారు. ఆదిత్య హిమని రమ్మని పిలుస్తాడు. సౌందర్య హిమనీ మధ్యలో కూర్చోబెట్టుకుని.. ‘మీ డాడీకి ఎవరో కొత్తమ్మని చూస్తున్నా అన్నావ్‌గా ఏమైంది?’ అని అడుగుతుంది. అయితే ‘మౌనితకి మంచి భార్యకు ఉండాల్సిన లక్షణాలు లేవని సౌందర్య అన్న మాటకు కార్తీక్ కూడా సపోర్ట్‌గా మాట్లాడటం గుర్తు చేసుకుంటూ. ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది.

ఈ రోజు నవంబర్6 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. 

సౌందర్య హిమనీ మధ్యలో కూర్చోబెట్టుకుని.. ‘మీ డాడీకి ఎవరో కొత్తమ్మని చూస్తున్నా అన్నావ్‌గా ఏమైంది?’ అని అడుగుతుంది. అయితే ‘మౌనితకి మంచి భార్యకు ఉండాల్సిన లక్షణాలు లేవని సౌందర్య అన్న మాటకు కార్తీక్ కూడా సపోర్ట్‌గా మాట్లాడటం గుర్తు చేసుకుంటూ లేదు నానమ్మ, ఒకరనుకున్నాను కానీ కుదర్లేదు, డాడీకి కర్రెక్ట్ కాదని అర్థమైనది అంటుంది హిమ. ఆ మాటకి ఆనందరావు, సౌందర్య, ఆదిత్యలు సంతోషంగా నవ్వుకుంటారు.

సౌర్య ఎవరి విహారి, ఎక్కడుంటాడు, నాకేమవుతాడు అని ఆలోచిస్తుంది.. ఇంతలో దీప ఇంటికి వస్తుంది. సౌర్యతో సరోజక్కకి జ్వరం అని వారణాసి ఆటోలో వెళ్లిందని నాకు ఎందుకు అబదం చెప్పి ఇంట్లోంచి పంపించావ్ అత్తమ్మా? ఇళ్లంతా జల్లెడ పట్టావా?’ అంటూ సౌర్యని తిడుతుంది. సౌర్య అవేవి పట్టించుకోకుండా విహారీ ఎవరు? ఎక్కడుంటాడు? నాకేమవుతాడు? అని అడుగుతుంది.

దీప సౌర్యను ‘అతను నీకు ఎలా తెలుసు?’ అని అడగగానే.. ‘దీపారాధన’ బుక్ చూపించి.. ఈయన గురించి చెప్పు అని అడుగుతుంది సౌర్య. ‘తెలుగు వాళ్లందరికీ తెలుసు అంటుంది దీప. ఎవరు ఈయన? నాకేమౌతారు? అంటుంది సౌర్య. నాకు అన్న అయితే నీకు ఏం అవుతాడు?’ అంటుంది దీప. ‘మావయ్యా అవుతాడు.. అయితే మామయ్యకి నాన్న తెలుసా? ఇతను ఎక్కడుంటాడు?’ అని ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ విసిగిస్తున్నా… దీప మాత్రం పొగరుగా.. ధీమాగా సమాధానం ఇస్తూ ఉంటుంది.

కార్తీక్, హిమ బెడ్ మీద పడుకుని ఉంటారు. హిమ మౌనిత గురించి ఆలోచిస్తూ ‘మౌనిత ఆంటీకి ఏ పని రానప్పుడు డాడీకి ఏంచేసి పెడుతుంది. డాడీ మౌనితని పెళ్లి చేసుకున్న మల్లి డాడీ పనులు డాడీనే చేసుకోవాలి. లేదంటే మాలతీ లాంటి వాళ్లు చేసి పెట్టాలి. కాబట్టి కొత్త అమ్మగా మౌనిత పనికిరాదు అని నిర్ణయి తీసుకుంటుంది. హిమ ఆలోచనలు గమనించిన కార్తీక్ హిమ ఇంకా పడుకో లేదా.. ఏం ఆలోచిస్తున్నావు.. అనవువసరంగా ఏవేవో ఏవేవో ఆలోచించకు, నేను బానే ఉన్నాను పడుకో అంటాడు.

హిమ నువ్వు బాలేదు డాడీ.. నాకు తెలుసు, నువ్వు బాగుంటే 100 ఇయర్స్ వద్దు అని ఎందుకు అంటావ్ అంటుంది. గతంలో నీకు 100 ఇయర్స్ డాడీ అని హిమ అంటే 100 ఇయర్స్ వద్దు ఇప్పటికే 90 ఇయర్స్ చూసేశాను అంటాడు కార్తీక్. లేదు డాడీ మనకు కొత్త అమ్మ కావాల్సిందే’ అని చెప్పడంతో కార్తీక్ ఆలోచనలో పడతాడు.

దీప వారణాసికి కాల్ చేసి.. గుడికి వెళ్లాలని చెప్పానుగా వారణాసి’ ‘ఇంత లేట్ చేశావేంటి? అని తిడుతుంది. స్కూల్ కి వెళ్లేముందు ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్లిందక్క, అదే అక్కా వాళ్ల అమ్మ ఎస్సై కదా.. ఎదో బుక్ కావాలని ఆ ఇంటికి వెళ్ళొచ్చింది. అందుకే లేట్ అయింది. ఇప్పుడే స్కూల్లో దింపాను..అని చెబుతాడు వారణాసి. ఫోన్ పెట్టేసిన దీప ఆలోచిస్తూ ఆద్య వాళ్ళ అమ్మ ఎస్సై కాబట్టి వాళ్ళ నాన్న గురించి ఏమైనా కనుకోమని అడగడానికి వెళ్లిందా.. ‘ఈ మధ్య అత్తమ్మ ఏదీ నాకు చెప్పుకుండానే చేస్తోంది. అనుకుంటూ దేవుడి దగ్గరకు వెళ్లి తన కష్టాల గురించి చెప్పుకుని ఏడుస్తుంది ఇంతలో సౌందర్య ఫోన్ చేసి రమ్మంటుంది.

సౌర్య స్కూల్‌లో ఆలోచించుకుంటూ నడుస్తూ, ఉంటుంది. ఇంతలో హిమ కనిపిస్తుంది. నా బర్త్ సర్టిఫికెట్ హిమ ద్వారా దొరుకుతుందేమో.. ఎందుకంటే ఇద్దరం ఒకేసారి, ఒకే రోజు పుట్టాం కదా? ’ అని ఆలోచించుకుంటూ హిమని పిలిచి.. ‘నీకు బర్త్ సర్టిఫికెట్ ఉందా? మనం ఇద్దరం ఒకే రోజు పుట్టాం కదా? నేను నువ్వు ఒకే హాస్పెటల్‌లో పుట్టామేమోనని అడుగుతున్నాను.. నువ్వు మీ డాడీని అడుగుతావా?’ అంటుంది సౌర్య. దానికి హిమా.. అవునూ నువ్వు వేరే ఊరు కదా? మనమిద్దరం ఒకే హాస్పెటల్‌లో ఎలా పుడతాం?’ అని రివర్స్‌లో అడగడంతో సౌర్య.. ‘హా అవును కదా.. మరిచిపోయాను’ అంటుంది. సరేలే నేను మా డాడీని అడుగుతానులే. రా ఆడుకుందాం అంటుంది హిమ. ఇంతటితో ఈ ఎపిసోడ్ పుత్తయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here