Karthika Deepam నవంబర్7 ఎపిసోడ్: కార్తీక్ దీప చేసిన సందడి చూస్తే నవ్వు ఆపుకోలేరు..

0
370

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

సౌర్య స్కూల్‌లో ఆలోచించుకుంటూ నడుస్తూ, ఉంటుంది. ఇంతలో హిమ కనిపిస్తుంది. నా బర్త్ సర్టిఫికెట్ హిమ ద్వారా దొరుకుతుందేమో.. ఎందుకంటే ఇద్దరం ఒకేసారి, ఒకే రోజు పుట్టాం కదా? ’ అని ఆలోచించుకుంటూ హిమని పిలిచి.. ‘నీకు బర్త్ సర్టిఫికెట్ ఉందా? మనం ఇద్దరం ఒకే రోజు పుట్టాం కదా? నేను నువ్వు ఒకే హాస్పెటల్‌లో పుట్టామేమోనని అడుగుతున్నాను.. నువ్వు మీ డాడీని అడుగుతావా?’ అంటుంది సౌర్య. దానికి హిమా.. అవునూ నువ్వు వేరే ఊరు కదా? మనమిద్దరం ఒకే హాస్పెటల్‌లో ఎలా పుడతాం?’ అని రివర్స్‌లో అడగడంతో సౌర్య.. ‘హా అవును కదా.. మరిచిపోయాను’ అంటుంది. సరేలే నేను మా డాడీని అడుగుతానులే. రా ఆడుకుందాం అంటుంది హిమ.

ఈ రోజు నవంబర్7 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

సౌందర్య దీప ఒకచోట కలుసుకుంటారు.. మౌనిత హిమనీ బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది కదా వాటన్నిటికీ పులిస్టాప్ పెట్టేసాను. ఇక ఆ మౌనిత హిమ జోలికి రాదు, దీప నీకొక మాట చెప్పనా.. భర్తకు భార్య దూరంగా ఉంటేనే ఇంకొక ఆడదానికి అవకాశం దొరుకుతుంది. ఆయన నువ్వు అందరితో బాగుంటావ్ కానీ కట్టుకున్నవాడు ఏమన్నా అంటే మాత్రం కనుబొమ్మలు టింగుమని పైకి లేస్తాయి. అంటుంది సౌందర్య. దానికి దీప ఆయన నా వ్యక్తిత్వాన్ని అంటాడు అందుకే ఆలా ఉండాల్సి వస్తుంది అంటుంది.

ఇక సౌందర్య సౌర్య పరిస్థితి ఏంటే ?’ అని అడుగుతుంది. ఎక్కడికక్కడే ఆరాలు మొదలుపెట్టింది. అందుకే మనశాంతి లేక గుడికి బయలుదేరాను’ అంటుంది దీప. సరే వేళ్ళు గుళ్లో కార్తీక దీపాలు వెలిగించు అక్కడే మనశాంతి దొరికేవరకు అక్కడే కూర్చో అంటుంది సౌందర్య. దీప స్కూల్లో లంచ్ బాక్స్ లు ఇవ్వాలి అత్తయ్య అంటుంది దీప. సౌందర్య ఈ రోజు సెలవు తీసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది.

దీప గుడి లోపలికి వెళ్తూ ఉంటె.. ఇంతలో కార్తీక్ కారు గుడి ముందు కాస్త దూరంలో ఆగిపోతుంది. కార్తీక్‌ని చూసిన దీప.. ఆగి గుడి ముందు నిలబడి గమనిస్తుంది. అక్కడో దొంగ.. కార్తీక్ వెనుక నుండి పర్స్‌ లాగేందుకు ప్రయత్నిస్తాడు. కార్తీక్ వంగి కారు ముందు ఏం ప్రాబ్లమ్ వచ్చిందని చెక్ చేస్తుండగా.. కార్తీక్‌కి కూడా తెలియకుండా పర్స్ లాక్కుని పరుగుతీస్తాడు. అది చూసిన దీప.. ఏ దొంగ.. అంటూ చేతిలోని కొబ్బరికాయ తీసుకుని ఫోర్స్‌గా విసిరి కొడుతుంది. అది తలకు తగిలి వాడు కింద పడిపోతాడు. వాడు ఎందుకు పడ్డాడో అర్థం కాక.. కార్తీక్ కూల్‌గా వచ్చి ఏమైనదని చూస్తాడు.

దీప కూడా అక్కడకు పరుగున వచ్చి.. దొంగ సచ్చినోడు మీ పర్స్ కొట్టేస్తాడా అమ్మా.. అంటూ వాడినుండి పర్స్‌ తీసుకుంటుంది. ఏంటీ.. ‘కొట్టావా?’ అని అడుగుతాడు కార్తీక్ ఆశ్చర్యంగా.. ‘అవును కొట్టాను.. ఒక టెంకాయ.. రెండు చిప్పలు’ అంటుంది దీప కూల్‌గా.. దాంతో కార్తీక్ తల పట్టకుని ఆ దొంగ ముందు కూర్చొని ‘ఒసేయ్.. మెంటల్ దానా.. వీడు పోయినట్టున్నాడే.. అంటాడు. ఆమ్మో.. నాలో ఇంత బలముందని నాకే తెలియదు డాక్టర్ బాబూ అంటుంది దీప. నీ.. గుమ్మడికాయ అనుకున్నావేంటే వాడి తలకాయ్ అంటాడు కార్తీక్. వాడి బాబుది అనుకున్నాడా పర్స్.. డబ్బు సరిగా ఉందొ లేదో చూసుకోండి అంటుంది దీప.

కార్తీక్ ఆ దొంగను చెక్ చేసి ఒసేయ్ వీడు ఇంకా బతికే ఉన్నాడే.. అంటాడు. ఎప్పుడెలా డాక్టర్ బాబు.. ‘మూడో కంటికి తెలియకుండా ఉస్సేన్ సాగర్‌లో పాడేద్దామా అంటుంది దీప. ‘ఇంత టెన్షన్‌లో కూడా నీ బ్రెయిన్ ఇంత షార్ప్ గా పనిచేస్తుందేంటే.. అంటాడు కార్తీక్. నా బ్రెయిన్ ఎప్పుడు షార్పె డాక్టర్ బాబు.. మీరే గుర్తించలేదు అంటుంది దీప. తర్వాత స్కానింగ్ చేసి నీ ఐక్యూ లెవెల్ తెలుసుకుంటాలే.. కానీ ఇప్పుడు పద హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటాడు కార్తీక్. ‘అయ్యో డాక్టర్ బాబూ.. మరిచిపోయారా? మనకే హాస్పెటల్ ఉంది కదా?’ అంటుంది దీప. ‘అవును కదా మరిచిపోయాను.. పద ఎవరు చూడకుండా హాస్పెటల్‌కి తీసుకుని వెళ్దాం’ అంటూ ఇద్దరు కలిసి మెల్లగా దొంగని కారు ఎక్కిస్తారు.

ఎవరో వస్తున్నారు డోర్ మూయండి.. డోర్ మూయండి.. అని డోర్ మూసి ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం కార్తీకమాసంకదా దీపాలు వెలిగివ్వాలి కదా డాక్టర్ బాబు అంటుంది దీప. అవునవును అంటాడు కార్తీక్. ఇప్పుడు పదండి అంటే కార్తీక్ వెనకసీటుకి వెళ్లబోతుంటే దీప అయ్యో డాక్టర్ బాబూ.. డ్రైవ్వింగ్ సీటు ముందుంది అంటుంది. కదా మర్చిపోయాను. అంటూ ఇద్దరు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు.

దీప కారు ఎక్కగానే నువ్వెందుకు నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటాడు కార్తీక్. దానికి దీప వీడు చస్తే ఆ నేరం మీమీదికి వస్తుంది. వీడిని చంపింది నేనే అని ఆ నేరాన్ని నా మీద వేసుకుంటాను అంటుంది దీప. నీ మొఖం.. సౌర్య గురించి ఆలోచించే ఆ మాట అంటున్నావా నువ్వు పో.. అంటూ ఒక్క క్షణం తనలోని ప్రేమను బయటపెడతాడు కార్తీక్. దీప మీ కర్చీఫ్ ఇవ్వండని అందులో పగిలిన రెండు కొబ్బరి చిప్పలను తీసుకొని ఇవ్వే..సాక్షాలు, ఇవ్వే హత్య ఆయుధాలు, అని చెడుతుంది. దానికి కార్తీక్ వామ్మో.. ముదిరిపోయినా హంతకురాలిలా మాట్లాడాకే నాకసలే గాభరాగా ఉంది. వామ్మో తిట్టేటప్పుడు నీకు కాస్త దూరంగా ఉండాలని నాకు అర్దమైయింది అంటాడు కార్తీక్.

ఎట్టకేలకు దీప, కార్తీక్‌ ఆ దొంగని హాస్పెటల్‌కి తీసుకుని వెళ్లి చాలా హడావుడి చేస్తారు. జరిగిందంతా అక్కడ డాక్టర్స్‌కి దీప చెబుతూ ఉంటే.. కార్తీక్ ఆపడానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా అప్పుడే.. అదే హాస్పెటల్‌లో కార్తీక్‌కోసం ఎదురు చూస్తున్న మౌనిత కార్తీక్‌కి ఫోన్ చేస్తుంది. అది దీప లిఫ్ట్ చేసి.. ‘తర్వాత చేస్తారులే’ అని పెట్టేస్తుంది. మౌనిత ఫ్యూజ్ ఎగిరిపోతుంది. అదేంటీ ‘దీపా కార్తీక్ ఫోన్?’అని చూస్తుండగానే… బయట హడావుడి వినిపించిన మౌనిత బయటకి వచ్చి చూసి.. ‘ఎవరు ఇతను?’ అంటుంది. దొంగ ఇతను అంటుంది దీప. దొంగా.. దొంగని మీరు తీసుకరావడమేంటి అంటుంది మౌనిత షాకింగ్‌గా. నువ్వాగమ్మ ఎక్కడసలే మనిషి పోయేలా ఉన్నాడు.. అంటుంది దీప.

డాక్టర్ హార్ట్ బీట్ చుడండి, పల్స్ రేట్ చుడండి, బ్రీతింగ్ చుడండి, అసలు లోపల జీవుడు ఉన్నాడా డాక్టర్.. సిటీ స్కాన్ తీయండి.. బ్రెయిన్ ఉందొ బెండకాయ పచ్చడిలా చితికిపోయిందో.. అంటూ కంగారు పడుతుంది. అది చూసి కార్తీక్ నువ్వాగు కంగారు పడకు.. అంటాడు. నా కంగారు నా గురించి కాదు డాక్టర్ బాబూ.. మీ గురించే.. నేనేమైపోయిన పర్వాలేదు మీ పేరు బయటికి రాకూడదు అంటుంది దీప. అంతంత పెద్ద మాటలు ఎందుకు.. అసలు నీకు మెంటలా ఎంత పని చేసావ్.. అంటాడు కార్తీక్. ఏమయింది కార్తీక్ అంటాడు డాక్టర్. నేను చెప్తాను డాక్టర్ అంటుంది నువ్వు ఆపుతావా అంటూ దీప నోరు మూసి బయటికి తీసుకెళ్తాడు కార్తీక్..

దీపను కూర్చో బెట్టి.. చిప్పలను లోపల పెట్టు, నీకేమన్నా పిచ్చ.. నేనే కొట్టాను.. నేనే కొట్టాను.. అంటావేంటి.. వాడు పోతే నిన్నే జైలులో వేస్తారు అంటాడు కార్తీక్. వేస్తె వేయనివ్వండి నేనే కదా కొట్టాను.. ఈ చిప్పలే సాక్షం ఆ అంటుంది దీప. పళ్ళు రాలగొడుతాను ఏమనుకున్నావో.. కేసు అంటే ఉత్త కేసు కాదు మర్డర్ కేసు తెలుసా.. అంటాడు.. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here