Karthika Deepam నవంబర్8 ఎపిసోడ్: మౌనిత ఆ దొంగను చంపేందుకు లోపలికి వెళ్తుంది కానీ ఇంతలో..

0
93

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

దీపను కూర్చో బెట్టి.. చిప్పలను లోపల పెట్టు, నీకేమన్నా పిచ్చ.. నేనే కొట్టాను.. నేనే కొట్టాను.. అంటావేంటి.. వాడు పోతే నిన్నే జైలులో వేస్తారు అంటాడు కార్తీక్. వేస్తె వేయనివ్వండి నేనే కదా కొట్టాను.. ఈ చిప్పలే సాక్షం ఆ అంటుంది దీప. పళ్ళు రాలగొడుతాను ఏమనుకున్నావో.. కేసు అంటే ఉత్త కేసు కాదు మర్డర్ కేసు తెలుసా.. అంటాడు..

ఈ రోజు నవంబర్8 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

ఏంటే నువ్వు దేంతో పడితే దానితో కొట్టేయడమేనా అని నెత్తిమీద ఒక్క మొట్టకాయ్ వేస్తాడు. ఇదంతా చూస్తున్న మౌనిత మనసులో దీప దొరికావే.. వాడిని చంపేసి నిన్ను మర్డర్ కేసులో ఇరికిస్తా అని దొంగ ఉన్న ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తుంది. ఆ దొంగ కళ్ళు తెరిచి.. డాక్టర్ ఇన్‌జెక్షన్ ఇవ్వడం చూసి.. పైకి లేచి.. టక్కున పైకి లేచి నాకేం కాలేదు డాక్టర్ బాబూ.. వాళ్ళు పోలీసులకు పట్టిస్తారని బయపడి ఊపిరి బిగపట్టి చచ్చిపోయినట్టు నటించాను.. నాకు ఆపరేషన్ వద్దు బాబోయ్… అంటూ పరుగుతీస్తాడు.

అది చూసి ఏమైన్ది డాక్టర్ అని టెంక్షన్ పడుతూ అడుగుతాడు కార్తీక్. వాడికి ఏం కాలేదు డాక్టర్ కార్తీక్ అని జరిగిందంతా చెప్పడంతో దీప పడిపడి నవ్వుతుంది. కార్తీక్ కి కూడా నవ్వు వస్తుంది. పక్కనే ఉన్న నర్స్ కూడా నవ్వుతూ ‘డాక్టర్ అమ్మ(దీప)ని భలే భయపెట్టాడు సార్’ అంటుంది. ‘మామూలుగా టెన్షన్ పెట్టలేదు..’ అంటూ తలపట్టుకుంటాడు కార్తీక్. ‘చచ్చాడేమో అనుకున్నాను డాక్టర్ బాబూ’ అంటుంది దీప నవ్వుతూనే. ‘నన్ను కూడా హడలు కొట్టావ్ కదే’ డాక్టర్ బాబూ ఈ సాక్షాలు అని అంటే కార్తీక్ కొబ్బరిచిప్పలు.. వాటి మీద ఫింగర్ ప్రింట్స్ అంటా.. అంటూ దీప నెత్తిమీద ఒక్కటిస్తాడు కార్తీక్.

డ్రైవర్ వచ్చి మేడం గారిని డ్రాప్ చేసిరావాలంట కొంచం కారు కీస్ ఇస్తారా సర్ అని అడుగుతారు సరే అని కీస్ ఇస్తాడు కార్తీక్. ఇదంతా చూస్తున్న మౌనిత రగిలిపోతుంది. ఇక దీప కారు లో కూర్చొని జరిగిందంతా తలుచుకుంటూ చాలా సంతోషంగా నవ్వుకుంటుంది..

సౌర్య, హిమ స్కూల్లో క్యారేజ్‌ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. (సౌందర్య దీపను కలిసినప్పుడు నువ్వు ఈ రోజు సెలవు తీసుకో నేను చూసుకుంటాను అంటుంది) ఇంతలో సౌందర్య దీపలనే క్యారేజ్‌లు బుట్ట పట్టుకుని కారులోంచి దిగుతుంది. అది చుసిన సౌర్య, హిమలు షాక్ అవుతారు. వాళ్ళను గమనించిన సౌందర్య కోడలా.. పడకపడక నీ కూతురి కంట్లో పడ్డాను కాదే.. నన్ను సీనియర్ వంటలక్కను చేసి పారేస్తుందేమో.. అనుకుంటుంది. ఇంతలో సౌర్య, హిమలూ.. ఏంటి నాన్నమ్మా క్యారేజ్‌లు నువ్వు తీసుకొచ్చావ్?’ అంటారు. ‘మీ వంటలక్కకు ఇవాళ వీలు కాలేదట.. ఆలస్యం అవుతుందని కంగారు పడుతుంటే నేను మాలతి(ఇంటి పనిమనిషి)తో వంట చేయించి తీసుకొచ్చాను. అని చెప్పి ఇవి ఎవరెవరికి ఇవ్వాలో అందరికీ ఇచ్చి రండి అని చెబుతుంది సౌందర్య. సరేనని వాళ్లిదరు కలిసి మోసుకెళ్లి అందరికి ఇస్తూ ఉంటారు.

సౌందర్య ఒక్కసారి మోసుకొచ్చినందుకే జబ్బలన్నీ పట్టేసాయి.. నా కోడలు దీప ఎలా మోసుకొస్తుందో.. ఏం కర్మ నీకు వంటలక్క అనుకుంటూ వెనక్కి తిరిగే సరికి కార్తీక్ అక్కడ ఉంటాడు. సౌందర్యను చూసి ‘ఏంటి మమ్మీ కంగారు పడుతున్నావ్?’ .. అంటాడు నినా కంగారా.. ఇదేంలెదే.. మువ్వెందుకొచ్చావ్ అని అడుగుతుంది సౌందర్య. ‘హిమకి టూర్‌ ఫీజ్ కడదామని వచ్చాను’ అని చెబుతాడు కార్తీక్. హిమాకేనా నేను కట్టేస్తానులే నువ్వు వేళ్ళు అంటుంది సౌందర్య. ఎలాగూ వచ్చాను కదా నేనే కట్టి వెళ్లుతాను అంటాడు కార్తీక్. ఇప్పుడు ఈ రౌడీ నోరుజారిందంటే వీడు వీరభద్రుడైపోతాడెమో’ అనుకుంటూ ‘నేను కడతానులే కార్తీక్ ఫీజ్ కట్టడానికి నా దగ్గర డబ్బు ఉండదా నువ్వు వెళ్లరా.. అంటూ కార్తీక్‌ని పంపించే ప్రయత్నం చేస్తుంది. అదేంటి మమ్మీ తరిమేస్తున్నావ్ అంటాడు.

ఇంతలో సౌర్య వచ్చి.. ‘నాన్నమ్మా.. మీరు తెచ్చిన క్యారేజ్‌లు అన్నీ పంచేశాం.. కార్తీక్ తో సౌర్య అమ్మకి ఎదో పని ఉందని చెబితే నానమ్మే నాన్నమ్మ మాలతీతో వంట చేయించి తీసుకొచ్చింది’ అంటుంది. ఇంతలో హిమనీ చుసిన సౌర్య అదిగో హిమ వస్తుంది’ అంటుంది. కార్తీక్ వెనక్కి తిరిగి హిమని చూసి షాక్ అవుతాడు. హిమ అచ్చం దీప నడిచినట్లే క్యారేజ్ బుట్ట పట్టుకుని నడిచి వస్తుంది. హిమని చూస్తున్న కార్తీక్‌కి దీపే గుర్తుకొస్తుంది. హిమ డాడీ .. ఏంటి డాడీ ఎలా వచ్చావ్.. అని అడుగుతుంది నీకు టూర్ ఫీజ్ కట్టాలన్నావ్ కదా అందుకే వచ్చాను, ఇదుగో డబ్బులు తీసుకో అని సౌందర్య వైపు కోపంగాచూస్తాడు. సౌర్య భాదను చూసి నెత్తి మీద ఒకటి ఇచ్చి.. ‘అడగొచ్చుగా..? సెల్ఫ్ రెస్పెక్టా?’ అంటూనే డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

కార్తీక్ డ్రైవింగ్ చేస్తూ.. జరిగిందంతా తలుచుకుంటూ.. ఆవేశంగా వేరే రూట్‌లో వెళ్లిపోతాడు. కార్తీక్ ని గమనించిన ఒకరు ఫోన్ చేసి ఏంటి కార్తీక్ మీ ఇల్లు జూబ్లీహిల్స్ కదా నువ్వెంటి తిరుమలగిరి వెళ్తున్నావ్ అంటాడు. కార్తీక్ కారు ఆపి వేరే పనిమీద వెళ్తున్నానని అబద్దం చెబుతాడు. జూబ్లీహిల్స్ ఎక్కడ.. తిరుమలగిరి ఎక్కడ.. ‘ఛి’ ‘బాగా డిస్ట్రబ్ చేస్తున్నారు. మమ్మీ అలా బాక్స్‌లు తీసుకుని రావడం, ఆ దీప హాస్పెటల్‌లో ఓవర్ యాక్షన్.. ఈ రెండూ ఒకేసారి జరగడం కాకతల్యమా లేక ప్రీప్లాన్డా? లాభంలేదు.. దీనికి ఓ పరిష్కారం ఆలోచించాలి. లేదంటే నేను ఏం అయిపోతానోనని భయంగా ఉంది అని బయలుదేరుతాడు కార్తీక్.

ఇక మోనిత హాస్పిటల్లో జరిగిందంతా గుర్తు చేసుకుంటూ రగిలిపోతూ ప్రియమణి తో తలపై ఐస్ పెట్టించుకుంటుంది. బుర్ర వేడెక్కుతుంది, నరాలు చిట్లిపోతున్నాయ్, బీపీ పాపం పెరిగినట్టు పెరుగుతుంది.. అంటూ మండిపడుతుంది మౌనిత. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here