Karthika Deepam నవంబర్12 ఎపిసోడ్: సౌర్య అమాయకంగా అడిగే ప్రశ్నలకు కార్తీక్ కళ్లల్లో నీళ్లు..

2
808

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

హిమ లోపలి వెళుతూ మాలతిని పాలు కాచివ్వమని అడుగుతుంది. నేను ఇవ్వను. అసలు మీ నానమ్మ గురించి నీకు ఏం తెలుసు, నేను నీ అంత ఉన్నప్పడి నుండి అమ్మగారిని చూస్తున్నాను. మీ నాన్నను ఎంత ప్రాణంగా పెంచారో నీకు తెలుసా.. ఎం తెలుసు నీకు.. నానమ్మతో ఆలా మాట్లాడొచ్చా.. అని అంటుంది. హిమ వెంటనే సారీ అంటుంది. నాకు కాదు వెళ్లి మీ నాన్నమ్మ కు చెప్పు అంటుంది నిదానంగానే..

ఈ రోజు నవంబర్ 12 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

దీప ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది. వారణాసి కూరగాయలు పట్టుకొచ్చి సౌర్య ఇంకా లేవలేదా అక్క స్కూల్ టైం అవుతుంది. లేపక్క అంటాడు. సౌర్య బెడ్ మీద మెళుకువతోనే పడుకొనీ అమ్మ సౌర్య అని పిలిస్తే నాన్న గురించి తెలుస్తుంది.. అత్తమ్మ అని పిలిస్తే తెలియదు’ మనసులో అనుకుని.. దీప ‘ఎప్పుడు పిలుస్తుందా.. అని చూస్తుంది. అమ్మ సౌర్య అను అత్తమ్మ అనకు ప్లీజ్ అనుకుంటుంది.

దీప వచ్చి ‘అత్తమ్మా’ అనబోయి ఆగి ‘అమ్మో అత్తమ్మ అని పిలిస్తే అమ్మగారికి బుస్సున కోపం వస్తుంది..’ అని మనసులో అనుకుంటూ.. ‘సౌర్యా స్కూల్ కి టైం అయింది లే’ అంటుంది సౌర్య వెంటనే లేచి ఎగిరి గంతేసి.. నాన్న ఎవరో తెలిసిపోయిందోచ్ అని మనసులో అనుకుంటూ.. దీప దగ్గరకు వెళ్లి.. దీపకు ముద్దు పెట్టి ‘థ్యాంక్స్ అమ్మా బాయ్’ అంటూ వెళ్లిపోతుంది. విషయం అర్థం కానీ.. దీప ఆశ్చర్యంగా..
ఎందుకు థ్యాంక్స్ చెప్పింది.. సౌర్య అన్నందుకా అనుకుంటుంది.

మౌనిత బాగా ఏడుస్తుంది. ఎన్ని ప్లాన్స్ వేసిన వర్కౌట్ కావట్లేదు ప్రియమణి.. నాకు అసలు పెళ్లి కానట్టుంది. ఈ జన్మలో నాకు కార్తీక్ దక్కేలా లేడు.. ఏం చేయాలి ప్రియమణి.. ఎట్లా వేగని వయసుతో.. ఎట్లా వేగని మనసుతో.. మహేష్ బాబుల పిడికిలి బిగించి కోడని కొట్టాలనిపిస్తుంది. దారిన పోయే వారందరిని కాలితో ఎగిరెగిరి తన్నలనిపిస్తుంది.. ఎవరైనా పచ్చని జంట బైక్ మీద కిలకిలా నవ్వుకుంటూ పోతుంటే.. కారుతో ఢీ కొట్టాలనిపిస్తోంది. అంటూ తన బాధని ప్రియమణికి చెప్పుకుంటూ ఏడుస్తుంది. వెంటనే ప్రియమణి అయ్యో పాపం.. అందుకే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ అవాసులోనే జరగాలి. వయసు దాటి పోతే ఇట్టాగే తయారైపోతారంటారు. మీరు ఏడిస్తే కుక్కపిల్లకు కూడా బాధకలగదు..పైగా బాగైంది.. బాగైంది.. అని చంకలు గుద్దుకుంటారు. మీరు ఏడిస్తే ఏడుపుకు కూడా పాపం అనిపించదమ్మా..కాబట్టి కళ్ళు తుడుచుకొని కూర్చోండి అంటుంది.

కార్తీక్, హిమ స్కూల్‌కి వేల్లేదుకు బయల్దేరుతారు. ఇంతలో సౌందర్య కోపంగా.. ‘ఆగండి అంటుంది. ఆనందరావు, ఆదిత్యలు కూడా అక్కడికి వస్తారు. వెంటనే సౌందర్య.. ‘నీ కూతురు నన్ను.. మా డాడీ అంటే నీకు ఇష్టం లేదని, నిను నిన్ను దూరంగా చూస్తానని అంటుంది ఈ పొట్టి బుడంకాయ అని చెబుతుంది సౌందర్య.

హిమ కార్తీక్ వెనక్కి వెళ్లి.. ‘పొట్టి బుడంకాయ అంటే ఏంటి డాడీ?’ అంటుంది. సౌందర్య నవ్వుని ఆపుకుంటూనే హిమని సీరియస్‌గా చూస్తూ నా దగ్గరకు రావె నేను చెబుతా.. అంటుంది. కార్తీక్ తప్పమ్మా నానమ్మతో ఆలా మాట్లాడొచ్చా వెళ్లి సారీ చెప్పు అంటాడు. దాంతో హిమ సారీ నానమ్మ ఇంకెప్పుడు ఆలా అనను అంటుంది. సౌందర్య హిమనీ దగ్గరకు తీసుకొని మనం ఫ్రెండ్స్ అంటుంది నవ్వుతూ.

కార్తీక్, హిమ ఇద్దరు స్కూల్ కి బయల్దేరుతుంటే.. సౌర్య అక్కడికి వస్తుంది. ‘డాక్టర్ బాబూ.. నేను మీతో మాట్లాడాలి అంటుంది. ఆనందరావు, ఆదిత్య, సౌందర్య షాక్ అవుతారు. ఏంటి రౌడీ అంటాడు కార్తీక్. ఎనిమిది సంవస్సరల క్రితం ఎక్కడ ఒక హాస్పెటల్ ఉండేదట కదా.. ఇప్పుడు అది లేదంట.. దాని ప్లేస్‌లో సూపర్ మార్కెట్ పెట్టారంట. ఆ డాక్టర్ అమెరికా వెళ్లిపోయాడట.. ఆ డాక్టర్ మీకు తెలుసా డాక్టర్ బాబూ? నేను అదే హాస్పెటల్‌లో పుట్టానట’ వాళ్ళ దగ్గరున్న నా బర్త్ సెర్టిఫికెట్లో మా ఇంటి అడ్రస్ ఉంటుంది కదా అందుకు.. అంటూ సౌర్య అమాయకంగా అడిగే ప్రశ్నలకు కార్తీక్ కళ్లల్లో నీళ్లు వస్తాయి.

దానికి( దీపకి) అంత గడ్డి పెట్టినా పిల్ల మనసులో ఏముందో తెలుసుకోకుండా వదిలేసింది. ఏమనాలి దాన్ని. పసిపిల్లని పిచ్చిదాన్ని చేసింది అని మనసుకు అనుకుంటూ సౌర్య తల నిమురుతూ ‘8ఏళ్ల క్రితం తీసేసిన హాస్పెటల్ కనుక్కోవడం చాలా కష్టం రౌడీ.. అయినా ఆ డాక్టర్ ఎవరో నాకు తెలియదమ్మా అంటూ సౌర్యతో భాదపడుతూ చెప్తాడు.

సౌర్య.. సౌందర్య వైపు చూసి .. ‘మీకైనా తెలుసా నాన్నమ్మా’ అని సౌర్య అడిగిన ప్రశ్నకు సౌందర్య నుంచి సమాధానం రాకపోవడంతో.. కార్తీక్ కారులో దింపుతానన్నా వినకుండా.. ఆటోలో వచ్చాను డాక్టర్ బాబూ.. అని చెప్పి వెళ్లిపోవడంతో.. సౌందర్య, ఆదిత్య, ఆనందరావులకు కన్నీళ్లు ఆగవు. కార్తీక్ కూడా హిమని తీసుకుని బయలుదేరతాడు.

ఆదిత్య నాకు ఏడుపొస్తుంది మమ్మీ దాన్ని (సౌర్య) చూస్తుంటే..’ అంటాడు ‘నాకు ఆవేశం వస్తుందిరా’ మీ అన్నాను చూస్తుంటే.. ఎం చేయను.. నాన్నని వెతకాలి అని ఒక ఉద్యమంలా నిర్ణయం తీసుకుంది. నాలగే దానికి పట్టుదల ఎక్కువ కచ్చితంగా కార్తిక్ తన తండ్రని తెలుసుకుంటుంది అంటూ సౌందర్య తన బాధని చెప్పుకుంటుంది.

దీపకు ఫోన్ చేసి జరిగిందంతా చెబుతుంది సౌందర్య. దాంతో దీప సరోజక్కతో తన తండ్రి గురించి అడగను అంటే మర్చిపోతుంది అనుకున్నాను కానీ నాతో చెప్పకుండా తనే వెతుకుతుందనుకోలేదక్క అని తన బాధనంతా చెబుతుంది.

హిమ, కార్తీక్ ఇద్దరూ కారులో స్కూల్‌కి వెళ్తూ.. హిమ సౌర్యని తలుచుకుంటూ… కార్తీక్ తో.. ‘డాడీ.. ప్రతి ఆడపిల్లకి తండ్రే.. హీరోనటగా’ అని అడుగుతుంది. ‘అవును’ అమ్మ డాడీ ఎం చేసిన హీరోలనే ఫీల్ అవుతారు.. కూతుళ్ళకి నన్నే హీరోల కనిపిస్తాడమ్మా.. అంటాడు కార్తీక్. ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తయిది.

2 COMMENTS

  1. price viagra

    Karthika Deepam నవంబర్12 ఎపిసోడ్: సౌర్య అమాయకంగా అడిగే ప్రశ్నలకు కార్తీక్ కళ్లల్లో నీళ్లు.. | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here