KarthikaDeepam అక్టోబర్ 1 ఎపిసోడ్‌: దీప బర్త్ డే కంటే ముందే కార్తీక్ లో మార్పు రావాలి – సౌందర్య

2
787

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.

సౌందర్య హిమ మాటలను తలుచుకుంటూ నిద్రపోకుండా ఆలోచిస్తుంది. ఆనందరావు ఏం ఆలోచిస్తున్నావు సౌందర్య అని అడిగితె.. అప్పుడు సౌందర్య నేను మంచిదాన్న, చెడ్డదాన్న, మంచి తల్లిని కాలేక పోయాను అని బాధ పడుతుంటే.. ఆ బాధని పొగొట్టి పొడుకునేలా ధైర్యం చెబుతాడు ఆనందరావు. పొద్దున్నే దీప లేచేసరికి సౌర్య పక్కనే ‘వెల్‌కమ్ డాడీ’ అని కొన్ని డ్రాయింగ్ చార్ట్స్ వేసి ఉంటాయి. అవి చూసి.. ‘పసి దానికి లేనిపోని ఆశలు పెట్టానా? ఇప్పుడు ఏం చెయ్యాలి?’ అంటూ దీప బాగా ఏడుస్తుంది. ఇక సౌందర్య టిఫిన్ తినకుండా కూర్చుంటుంది. అది తెలుసుకున్న కార్తీక్ తినిపించేందుకు ప్లేట్‌లో టిఫిన్ తీసుకుని వస్తాడు. ‘నాకేమీ వద్దు’ అంటుంది సౌందర్య.

ఈ రోజు అక్టోబర్ 1 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

సౌందర్య టిఫిన్ తినకుండా కూర్చుంటుంది. అది తెలుసుకున్న కార్తీక్ తినిపించేందుకు ప్లేట్‌లో టిఫిన్ తీసుకుని వస్తాడు. ‘నాకేమీ వద్దు’ అంటుంది సౌందర్య. తిను మమ్మీ అని బతిమిలాడుతాడు కార్తీక్. అప్పుడు సౌందర్య నీ కూతురు అన్నన్ని మాటలు అంటుంటే చూస్తూ కుర్చున్నావ్ కానీ ఏమైనా అన్నావా.. అంటుంది. దానికి కార్తీక్ ‘చిన్నపిల్ల కదా మమ్మీ.. దానికేం తెలుసు.. అంటాడు. నీకు ఇంత వయసు వచ్చింది కదా నీకు మాత్రం ఏం తెలుసురా అంటుంది సౌందర్య. ఇక కార్తీక్ సౌందర్యని బతిమిలాడి టిఫన్ తినిపిస్తాడు. ఎవరు నన్ను అర్ధం చేసుకోవట్లేదు, అందరు నాకు రివర్స్ అయ్యేసరికి ఉక్రొషం పోడుచోకోచింది అంటాడు కార్తీక్ బాధగా..

అప్పుడు సౌందర్య కూడా బాధ పడుతూ.. నేను నిన్ను ఏ విషయంలో కట్టడి చేస్తున్నానురా.. దీప ఇంట్లో లెక్కప్రకారం ఆరు నెలలు ఉండాలి ఉన్నావా.. అక్కడే ఉండమని వెళ్ళకొట్టనా.. ఆ మౌనిత ఇంటికి నీ కూతుర్ని తీసుకుని వెళ్లావ్.. అడ్డుపడ్డానా? ఇప్పుడు దీప కూతురికి నిన్ను తండ్రిగా పరిచయం చేస్తానంటోంది. దాని బర్త్ డే కి తప్పకుండ వెళ్ళమని చెప్పనా.. నీ నిర్ణయాలన్నీ నువ్వే తీసుకుంటున్నప్పుడు నేను నిన్ను కట్టడి చేసింది ఎప్పుడు చెప్పారా.. వద్దు మన మధ్య దూరం పెంచుకునే ముందు నా తప్పు ఏముందో కూడా ఆలోచించడం మొదలుపెట్టు. హిమ చిన్న పిల్ల దానికంటే తెలీదు. కానీ దాని మనసుకు కూడా తెలియని నా అంతరంగం నీకు బాగా తెలుసుకదా.. నువ్వెప్పుడూ నన్ను అర్ధం చేసుకున్నావ్ రా.. అని సౌందర్య కార్తీక్ ని నిలదీస్తుంది.

దీప ఇంటికీ వారణాసి.. కాస్త భయపడుతూ.. ‘అక్కా.. సౌర్యమ్మా బస్తీలో అందరీ ఇంటికీ వెళ్లి.. మా అమ్మ పుట్టిన రోజు నాడు మా నాన్న వస్తున్నారు.. మీరంతా రండీ అని చెబుతుంది అక్కా…? సౌర్యమ్మని చుస్తే భయంగా ఉంది అక్క.. డాక్టర్ బాబుని ఒక మాట అడిగి సౌర్యమ్మకి మాట ఇవ్వాల్సిది కదా అక్క.. అంటాడు. ఆ మాటలకు దీప ఎమోషన్‌గా అక్కడ ఉన్న కూరగాయలన్నీ విసిరేసి.. వారణాసి కాలర్ పట్టుకుని.. ఏం చేయనురా.. నేను ఇప్పుడే ఏం చేయను? చావమంటావా? అంటూ ఏడుస్తుంది. వారణాసికి భయమేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. దీప నేల మీద కూలబడి బాగా ఏడుస్తుంది.

మౌనిత కారులో వెళ్తుంటే వెనకాలే మరో కారు ఫాలో అవుతుంది. మౌనిత ఈ కారు నన్నే ఫాలో అవుతుంది.. ఆ దుర్గా గాడే అయ్యుంటాడు అని కారు పక్కకు ఆపి దిగి వెళ్తుంటే ఫోన్ వస్తుంది. ఫోన్ లో ‘నిన్ను వీడని నీడను నేనే’ అంటూ పాట పాడిన దుర్గా.. ఏంటి బంగారం కంగారు పడ్డావా…. ‘నిన్ను ఫాలో అయ్యేది నేను’ కాదు అంటాడు నవ్వుకుంటూ. ఇంతలో వెనుక కారులోంచి మరో వ్యక్తి దిగడం చూసి.. కూల్ అయ్యి కారులో కూర్చుంటుంది. అయితే ఫోన్‌లో వినిపించే పాట మౌనిత కారు వెనుక సీట్‌లోంచి వినిపించడంతో వెనక్కి తిరిగి చూస్తే దుర్గా భయంకరంగా ఫేస్ పెట్టి మౌనితని భయపెట్టి.. ‘బాయ్ బంగారం’ అంటూ వెళ్లిపోతాడు.

సౌందర్య, ఆనందరావుతో హిమకి నా మీద బాగా కోపం వచ్చినట్టుంది. ఈ రోజు కూడా వాళ్ల నాన్ననే క్యారేజ్ తీసుకురమ్మంది అంటూ బాధ పడుతూ చెబుతుంది. రాను రాను హిమ కార్తీక్ మీద చాలా ప్రేమ పెంచుకుంటుంది.. అంటాడు ఆనందరావు. అప్పుడు సౌందర్య అదే నాకు భయంగా ఉందండి. దీప, కార్తీక్ లు కలిసిపోకముందే, హిమ దీప కూతురని కార్తీక్ కి తెలిసిపోతే చాలా ప్రమాదం. అది దీప కూతురని తెలిస్తే కార్తీక్ హిమని దగ్గరకు కూడా రానివ్వడు. అప్పుడు హిమ ఏమైపోతుందండీ? అటు చుస్తే సౌర్య తన తండ్రి కోసం ఎన్నో కలలు కంటోంది..ఏం చేయాలో అర్ధం కావట్లేదండి. కానీ ఇదంతా మన చేతుల్లో లేదుకదా సౌందర్య? అంటాడు ఆనందరావు. అన్నింటికీ పరిష్కారం ఒకటే నండీ.. దీప బర్త్ డే కంటే ముందే కార్తీక్ లో మార్పు రావాలి.. వాడే ఆ కవలలకు తండ్రి అని ఒప్పుకోవాలి అంతకు మించి ఏ దారిలేదు. అంటూ సౌందర్య, ఆనందరావు మాట్లాడుకుంటారు.

దీప సౌర్యకి ఇచ్చిన మాట గురించి ఆలోచించుకుంటూ క్యారేజులు తీసుకుని స్కూల్‌కి వస్తుంది. కార్తీక్ కూడా హిమ కోసం క్యారేజ్ తీసుకుని కారు దిగుతాడు. దీప మనసులో ఇవ్వాళ ఎలాగైన డాక్టర్ బాబుతో బర్త్‌డే విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటూ కార్తీక్ దగ్గరకు నడుస్తుంది. అయితే కార్తీక్‌కి విషయం ముందే తెలుసు కాబట్టి.. ‘ఆ మాట ఒప్పించడానికే వస్తుందా?’ అనుకుంటూ ఉంటాడు కార్తీక్.ఇంతలో డాడీ.. అనుకుంటూ హిమ నవ్వుతూ కార్తీక్ దగ్గరకు వస్తుంది. దాంతో దీప అక్కడే ఆగిపోతుంది. కార్తీక్ ఊపిరి పీల్చుకుంటాడు.

ఇంతలో టీచర్స్ వంటలక్కా.. అనిపిలుస్తారు. అప్పుడే హిమ కూడా వంటలక్కా.. అని దీప దగ్గరకు పరుగెత్తుతుంది. సౌర్య షాపింగ్ కి వెళ్లిందా.. వంటలక్క అని అడుగుతుంది హిమ. అవునమ్మా వాళ్ళ నాన్నకు బట్టలు కొనడానికి వెళ్ళింది అంటుంది దీప. ఇంతలో స్కూల్లో టీచర్స్ ‘నీ బర్త్‌డేకి కేక్ పంపాలనుకుంటున్నాం.. కేక్ మీద మీ పేరు రాయించాలనుకుంటున్నాం.. నీ పేరు ఏంటి అని అడుగుతారు. దానికి దీప చిన్నదో పెద్దదో సౌర్య తెస్తుంది లెండి అంటుంది. టీచర్స్ లేదు మీము తెస్తాం చెప్పండి అంటారు. దీప మీకు నేను వంటలక్కగానే తెలుసుకదా ఆ పేరే రాయించండి అంటుంది. అప్పుడే హిమ కూడా ‘అసలు ఎప్పుడూ నీ పేరు అడగలేదు.. నీ పేరు ఏంటి వంటలక్కా?’ అంటుంది. అదంతా గమనిస్తున్న కార్తీక్‌కి.. గతంలో ‘మీ అమ్మ పేరు దీప.. అచ్చం నీలానే ఉంటుంది’ అని హిమకి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఎప్పుడు ఇది నా పేరు దీప అని చెబితే ఏంటి పరిస్థితి అని ఆలోచించుకుంటాడు కార్తీక్ టెన్షన్ పడుతూ ఇంతటితో ఈ ఎపిసోడ్‌ అయిపోయింది.

నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందంటే.

దీప కార్తీక్ ఇంటికి వస్తుంది. సౌందర్య, ఆదిత్యల ముందు బర్త్‌డే విషయం చెప్పబోతుంది దీప. కానీ కార్తీక్ చెప్పనీవ్వకుండా ఆగు అని చేయి అడ్డు పెట్టి.. నేను నీకో విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను.. నువ్వు నీ కూతురికి ఇచ్చిన మాట కచ్చితంగా వెనక్కి తీసుకుంటావ్. నువ్వు జీవితంలో ఆ మాట నిలబెట్టుకోలేవు. అది గుర్తు పెట్టుకో’ అని చెప్పి వెళ్లిపోతాడు. దీప అలాగే ధీనంగా చూస్తూ.. ఉండిపోతుంది.

2 COMMENTS

  1. cialis 20 mg price

    KarthikaDeepam అక్టోబర్ 1 ఎపిసోడ్‌: దీప బర్త్ డే కంటే ముందే కార్తీక్ లో మార్పు రావాలి – సౌందర్యRanarangam news, telugu cinema news, trailers, reviews and Political news | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

  2. buy ciprofloxacin online

    KarthikaDeepam అక్టోబర్ 1 ఎపిసోడ్‌: దీప బర్త్ డే కంటే ముందే కార్తీక్ లో మార్పు రావాలి – సౌందర్యRanarangam news, telugu cinema news, trailers, reviews and Political news | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here