KarthikaDeepam అక్టోబర్ 22 ఎపిసోడ్: లాభం లేదు అసలు సౌందర్య కళ్ళు తెరవాల్సిందే:సౌందర్య

1
750

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

సౌందర్య, దీప మాట్లాడుకుంటుంటే విన్న సౌర్య.. నాన్న రాడా అమ్మ, నాకపోతే పోనీ అమ్మా.. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్’ ఊరుకో అమ్మ. ‘అమ్మా రా.. నా కోసం వచ్చి కేక్ కట్ చేయమ్మా..’ అంటుంది. దీప.. సౌర్య కోసం అందరి ముందూ కేక్ కట్ చేస్తుంది. ఇక ఆదిత్య శ్రావ్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ ఆవేశంగా ఇంటికి వచ్చి కోపంగా పైకి వెళ్లిపోతాడు. ఆదిత్యకు విషయం అర్థం కాదు. సౌందర్య ఆనందరావు, హిమను తీసుకుని ఇంటికి బయలుదేరతుంది. హిమ నిద్రపోవడంతో జరిగిందంతా ఆనందరావుకు చెబుతుంది. సౌర్య నిద్రపోతుంది. దీప ‘నాన్నకు స్వాగతం’ అనే బోర్డ్ చూస్తూ ఉంటుంది. స్వాగతం లో గతం వరకూ విరిగిన ఒక బోర్డ్ పట్టుకుని.. ‘నా కథలో గతం మాత్రమే మిగిలింది. భవిష్యత్ అంధకారం, అంతా చీకటి అంటూ ఏడుస్తుంది దీప.

ఈ రోజు అక్టోబర్ 22 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

సౌందర్య దీప అన్న మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ బాధ పడుతుంది. ఇక కార్తీక్ సౌందర్యంతో అమ్మ నిన్ను సూటిగా ఒక మాట అడుగుతాను సమాధానం చెబుతావా.. హిమను తెచ్చుకొని పెంచుకున్నట్టు నన్నుకూడా తెచ్చుకొని పెంచుకున్నావా అని అడుగుతాడు. దానికి సౌందర్య రా వెళ్దాం.. హిమ లాగే ఎక్కడినుండో తెచ్చుకొని పెంచుకోవడం లేదని, నువ్వు నా కడుపునే పుట్టిన కొడుకువని.. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే తప్ప నువ్వు నమ్మేటట్టు లేవు కదా. నీ భార్య పాతివ్రత్యాన్నే నమ్మని వాడివి, కన్నా తల్లి మాతృత్వాన్ని నమ్ముతావా నాయన.. సామెతలు, పురాణాలూ, విసుర్లు, సూటిగా, సుతి కొట్టకుండా అత్తలా కాకుండా అమ్మలా చెబుతున్నాను.. నిన్ను నేను నవమాసాలు కడుపులో మోసీ మరీ కన్నాను, బర్త్ సిర్టిఫికెట్ కూడా.. భద్రంగా దాచి ఉంచాను.. అసలు నీలో ఆ ప్రశ్న ఎందుకు పుట్టిందో చెప్పు అని కోపంగా అంటుంది సౌందర్య.

దానికి కార్తీక్ నేను నువ్వు చెప్పినట్టు వినాలి, నువ్వు గీత గిస్తే నేను దాటకూడదు. ఇందాక మీరు ఆడిన నాటకంలో నేనో కమిడియన్ లా మారిపోయి ఆడమన్నట్టు ఆడాలి.. మరి ఎందుకు ఎదురుతిరుగుతున్నాను.. అదే ఆదిత్య చూడు నువ్వు చెప్పింది వింటాడు, నువ్వు బావిలో దూకమన్న ఎందుకు అని ఆడకుండా ఒక్క క్షణం ఆలోచించకుండా దూకేస్తాడు అంటాడు కార్తీక్. దానికి సౌందర్య ఏ తల్లి ఆ కూపంలోకి దుఃఖమని చెప్పదు అంటుంది. అందుకు కార్తీక్ మరి నన్నెందుకు ఆ కూపంలోకి దూకమని చెప్తున్నావ్ మమ్మి.. ఈ క్షణం వరకు నువ్వు శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నావ్.. ఒక్కసారి నువ్వు ఆలోచించు మమ్మి అంటాడు కార్తీక్.

అప్పుడు సౌందర్య.. తప్పకుండా ఆలోచిస్తాను. కానీ అంతకంటే ముందుగా నువ్వు.. ఒక్కసారి ఒకే ఒక్కసారి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి అంటుంది సౌందర్య. దానికి కార్తీక్ చూడు మమ్మి.. నువ్వు దీపని అసహించుకునేటప్పుడే నేను దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. నేను దీపని ప్రేమించక ముందు.. ప్రేమించిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నాను.. అంటాడు కార్తీక్. అనుమానం ధ్రువపడ్డాక ఎలా చేయిచుకుంటాను. పోనీ ఒకవేళ డిఎన్ఏ చేయించుకుంటే.. నీకు నీకోడలు మీద ఉన్న అమితమైన ప్రేమతో ఆ డిఎన్ఏ రిపోర్ట్ మార్చేసి నన్ను మురికి కూపంలోకి తోచేసి అని కార్తీక్ అన్న వెంటనే.. సౌందర్య స్టాఫిట్ కార్తీక్ అని గట్టిగా అరిచి నీకు జీవితంలో ఎవ్వరూ అర్ధంకారు. అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

ఇక సౌందర్య ఆనందరావు వాకింగ్ కి వెళ్తారు. అక్కడ సౌందర్య ఆనందరావు తో వాడు నీ కొడుకునేనా అని అడుగుతున్నాడు, ఆదిత్య ఒక్కడే నా కొడుకు అంటున్నాడూ, అసలు కార్తీక్ నన్ను ఎప్పుడు అర్ధం చేసుకుంటాడో అంటూ భాద పడుతుంది సౌందర్య. ఇక ఆనందరావు అక్కడ లాఫ్ఫింగ్ క్లబ్ వాళ్ళు చాలా మంది నవ్వుతూ ఉంటారు అది చూసి అక్కడ చూడు వాళ్లకు ఏ బాధలు లేవంటావా.. అన్ని బాధలను మర్చిపోయి ఎలా నవ్వుతున్నారో చూడు.. మనం కూడా నవ్వుతూ సమస్స్యాలన్ని పరిష్కరిదం అంటాడు ఆనందరావు. దానికి నవ్వుతూ ట్రై చేస్తూ నా కోడలు, మనమరాలు ఎక్కడి నుండి కిలోమీటరులో కూరలు అమ్ముతూ బ్రతుకుతున్నారు. అంటూ నవ్వుకుంటూ చెప్పడానికి ట్రై చేస్తూనే ఏడుస్తూ.. నా నవ్వు చాలా ఆర్టిఫిషల్ గా ఉంది కదా అండి ఒకసారి వెళ్లి చూసొద్దామా అంటుంది సౌందర్య. అక్కడి నుండి దాప ఇంటికి వెళ్తారు.

దీప పడుకొని ఇంకా లేవకపోవడంతో సౌర్య అమ్మ లే అమ్మ చాలా పొద్దుపోయింది అంటూ దీపని లేపుతుంది. ఇంతలో సౌందర్య ఆనందరావు అక్కడికి వస్తారు.. దీపతో సౌర్య అమ్మా నన్ను అత్తమా అని పిలువడని, నాకు నాన్న లేడు, నీకు అత్తమ్మ లెదు, అందరిలానే పేరు పెట్టి పిలువు, అత్తమ్మ అని పిలువకు వాళ్ళు మనల్ని పాపం అని కూడా అన్నారు. మనకు ఎవరు లేరు అంటుంది. ఇదంతా సౌందర్య ఆనందరావులు వింటారు చాలా బాధపడుతారు.

దీప సౌందర్యను కూర్చోండి మేడం అంటుంది. సౌర కూడా మేడం అనడంతో అదేంటే నానమ్మ అని పిలిచేదానివి కదా మరి మేడం అంటున్నావేంటే అంటుంది సౌందర్య ఏడుస్తూ. దానికి సౌర్య.. నానమ్మ అని పిలుస్తే నాకు నాన్న గుర్తుకొస్తాడు. అప్పడు మల్లి నేను అమ్మని నాన్న గురించి అడగాల్సి వస్తుంది అంటూ.. అయ్యో అమ్మ చూడు ఎందుకు ఏడుస్తున్నారు అంటుంది సౌర్య. అదేం లేదమ్మా వాకింగ్ కి వెళ్లి వస్తున్నారు కదా నలక పడి ఉంటుంది అంటుంది దీప.

సౌర్యతో నువ్వు వాళ్ళను ఆలా అనకుండా ఉండాల్సింది సౌర్య వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు అని చెబుతుంది. సరే అమ్మ ఈసారి కలిస్తే సారీ చెబుతాను అంటుంది సౌర్య. ఇక సౌందర్య కారు సడన్ గా బ్రేక్ వేసి.. ఆ లాఫ్ఫింగ్ క్లబ్ వాళ్ళని రమ్మని విల్లా కథ చెప్పి ఇప్పడు నవ్వమనండి చూదాం.. అంటూ ఏడుస్తుంది. ఇక లాభం లేదు ఆనందరావు గారు అసలు సౌందర్య కళ్ళు తెరవాల్సిందే.. దీనంతటిని క్లోజ్ చేయాల్సిందే.. ఈ విషాదాన్ని, ఈ విచారాన్నితరిమి తరిమి కడుతాను అంటుంది.

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here