KarthikaDeepam అక్టోబర్ 2 ఎపిసోడ్‌: ప్లీజ్ దుర్గ నన్ను వదిలేయ్ అని కాళ్ళు పట్టుకున్న మౌనిత

1
685

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.

దీప అంటుంది మీకు నేను వంటలక్కగానే తెలుసుకదా ఆ పేరే రాయించండి అంటుంది. అప్పుడే హిమ కూడా ‘అసలు ఎప్పుడూ నీ పేరు అడగలేదు.. నీ పేరు ఏంటి వంటలక్కా?’ అంటుంది. అదంతా గమనిస్తున్న కార్తీక్‌కి.. గతంలో ‘మీ అమ్మ పేరు దీప.. అచ్చం నీలానే ఉంటుంది’ అని హిమకి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఎప్పుడు ఇది నా పేరు దీప అని చెబితే ఏంటి పరిస్థితి అని ఆలోచించుకుంటాడు కార్తీక్ టెన్షన్ పడుతూ…

ఈ రోజు అక్టోబర్ 2 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

ఇప్పుడు ఇది నా పేరు దీప అని చెబితే ఏంటి పరిస్థితి అని ఆలోచించుకుంటాడు కార్తీక్ టెన్షన్ పడుతూ…. ‘హిమా రా లంచ్ టైమ్ అయిపోతుంది.. నీ కోసం సర్జరీ పోస్ట్‌పోన్ చేసుకుని వచ్చాను’ వెళ్దాం రా అంటాడు. దాంతో హిమ అక్కడ నుంచి వెళ్తుంది. దీప మనసులో.. ‘డాక్టర్ బాబుతో బర్త్ డే విషయం ఆసుపత్రికి వెళ్లి మాట్లాడతాను. హిమ ముందు మాట్లాడటం కష్టం’ అనుకుంటుంది.

దుర్గ మందు కొడుతూ ఉంటాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగడం తో దుర్గ కమింగ్ అంటాడు. మౌనిత బాగా ఏడుస్తూ లోపలి వచ్చి దుర్గ కాళ్ళ మీద పడుతుంది. ఏంటే నా కాళ్ళ మీద పడ్డావ్ అందిన అందకపోయినా జుట్టుపట్టుకునే రకానివి కదా.. నీకేం మాయరోగం వచ్చిందే అంటాడు దుర్గ. నేను నీ టార్చర్ భరించలేకపోతున్నాను.. ప్లీజ్ దుర్గా నన్ను వదిలేయ్.. కార్తీక్ లేకుండా నేను బతకలేను, కార్తీక్ డబ్బు, అంతస్తు చూసి కాదురా నేను ప్రేమించింది.. కార్తీక్ అంటే నాకు పిచ్చి. కార్తీక్ లేకపోతే నేను పిచ్చిదాన్ని ఐపోతాను ప్లీజ్ నన్ను వదిలేయ్.. దుర్గ అంటుంది మోనిత. అయినా సరే దుర్గ కరగక పొగ ఇలా అంటాడు. ‘ కార్తీక్ కి పెళ్లి కాకుండా ఉండి ఉంటే.. నీ మోజుని ప్రేమ అని చెప్పుకుని పెళ్లి చేసుకుంటే నాకేం ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదుగా.. నిన్ను వదలను’ అంటూ మౌనిత మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడు దుర్గ.

మురళీ కృష్ణ సౌందర్య ఇంటికి వచ్చి డాక్టర్ బాబు ఇంట్లోనే ఉన్నాడా అమ్మ అని అడుగుతాడు. ఉంటె మీకేంటి మురళీ కృష్ణ గారు మీరు నా ఇద్దరి కొడుకులకు మామగారు ఎప్పుడైనా రావచ్చు అంటుంది సౌందర్య. ఏం లేదమ్మా ‘అల్లుడు గారి మీద నాకు ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ మౌనితే అల్లుడు గారి మనసుని పాడు చేస్తోందనిపిస్తోందమ్మా..’ అని తన మనసులో మాట చెబుతాడు మురళీ కృష్ణ. దాంతో (సౌందర్యకు మౌనిత హిమతో డాక్టర్ అమ్మ నుండి అమ్మ అని పిలిచేలా చేస్తానని ఛాలెంజ్ చేసింది గుర్తుకువస్తుంది). అర్థమైంది మురళీ కృష్ణ గారు. నాకు ఆ మౌనిత మీద నమ్మకం లేకపోయినా ‘నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది అలంటి వాటికీ వాడు దూరంగానే ఉంటాడు. అయినా ఈ విషయం నా దృష్టికి కూడా వచ్చింది. దాని గురించి నేను కూడా ఆలోచిస్తాను మీరు కంగారు పడకండి’ అని అంటుంది సౌందర్య. ‘సౌర్య పరిస్థితి గురించి బాధపడుతున్న మురళీ కృష్ణకి ధైర్యం చెప్పి.. ఇంటికి పంపిస్తుంది.

సౌందర్య అన్న మాటల గురించి ఆలోచిస్తు ఉంటాడు ‘మీ ఇద్దరి విడాకుల విషయం కోర్టులో ఉంది గుర్తు పెట్టుకో’ అన్న మాట గుర్తు చేసుకుంటూ ఉంటాడు కార్తీక్. ఇంతలో మౌనిత ఏడుస్తూ కార్తీక్ దగ్గరకి వస్తుంది. కార్తీక్ ఏమైంది మౌనిత అంటాడు. ‘ఆ దుర్గా గాడూ’ అని చెప్పబోయి ఆగిపోయి.. ‘నీ వల్లే.. ఇదంతా నీ వల్లే.. నువ్వే చేశావ్’ అంటూ మౌనిత ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. దీప సౌందర్య ఇంటికి వస్తుంది. ఆయన లేరా అత్తయ్య అని అడుగుతుంది. హాస్పిటల్ కె వెళ్ళాడు నువ్ వెళ్తే లేదని చెప్పించి ఉంటాడు అంటుంది సౌందర్య. అప్పుడే ఆదిత్య వస్తాడు ఏమైనది వదిన అలా ఉన్నావ్ అంటాడు. దీప అంటుంది ‘మీ అన్నయ్యని ఒప్పించు ఆదిత్యా.. నా బిడ్డకి నాన్న అనే పిలుపు దక్కేలా చేయి’ అంటూ ఏడుస్తూనే ఉంటుంది. సౌందర్య దీపని ఊరుకోబెట్టి కళ్లు తుడుస్తుంది. సరిగ్గా అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు.

నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందంటే.

దీప కార్తీక్ ఇంటికి వస్తుంది. సౌందర్య, ఆదిత్యల ముందు బర్త్‌డే విషయం చెప్పబోతుంది దీప. కానీ కార్తీక్ చెప్పనీవ్వకుండా ఆగు అని చేయి అడ్డు పెట్టి.. నేను నీకో విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను.. నువ్వు నీ కూతురికి ఇచ్చిన మాట కచ్చితంగా వెనక్కి తీసుకుంటావ్. నువ్వు జీవితంలో ఆ మాట నిలబెట్టుకోలేవు. అది గుర్తు పెట్టుకో’ అని చెప్పి వెళ్లిపోతాడు. దీప అలాగే ధీనంగా చూస్తూ.. ఉండిపోతుంది.

1 COMMENT

  1. viagra sales

    KarthikaDeepam అక్టోబర్ 2 ఎపిసోడ్‌: ప్లీజ్ దుర్గ నన్ను వదిలేయ్ అని కాళ్ళు పట్టుకున్న మౌనితRanarangam news, telugu cinema news, trailers, reviews and Political news | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here