KarthikaDeepam అక్టోబర్ 3 ఎపిసోడ్‌: ‘కార్తీక్ ని మా నాన్న ఎవరు’ అని అడిగిన సౌర్య

0
91

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంట..

దీప సౌందర్య ఇంటికి వస్తుంది. ఆయన లేరా అత్తయ్య అని అడుగుతుంది. హాస్పిటల్ కె వెళ్ళాడు నువ్ వెళ్తే లేనని చెప్పించి ఉంటాడు అంటుంది సౌందర్య. అప్పుడే ఆదిత్య వస్తాడు ఏమైనది వదిన అలా ఉన్నావ్ అంటాడు. దీప అంటుంది ‘మీ అన్నయ్యని ఒప్పించు ఆదిత్యా.. నా బిడ్డకి నాన్న అనే పిలుపు దక్కేలా చేయి’ అంటూ ఏడుస్తూనే ఉంటుంది. సౌందర్య దీపని ఊరుకోబెట్టి కళ్లు తుడుస్తుంది. సరిగ్గా అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు.

ఈ రోజు అక్టోబర్ 3 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

సౌందర్య దీపను మొఖం కడుక్కోమంటే.. మొఖం కడుక్కోవడానికి లోనికి వెళ్తుంది. అప్పుడే కార్తీక్ ఆవేశంగా… ఇంటికి వస్తూ వస్తూ మమ్మి మౌనితని ఏమన్నవ్.. మౌనిత కళ్లన్నీ ఉబ్బిపోయి ఏడ్చేఅంత మాట ఏమన్నవ్.. అని నిలదీస్తాడు. అప్పుడు సౌందర్య నినా! ‘ఆ మౌనితని నేనెందుకు అంటాను? అయినా చాటుగా వెళ్లి బెదిరించాల్సిన అవసరం నాకేంటీ?’ అంటూ రివర్స్ అవుతుంది సౌందర్య. అప్పుడే ఆదిత్య ఎవరు అన్నయ ఆ మోనిత, ఆమె గురించి మమ్మీ మీద ఫైట్ చేస్తున్నావేంటి అంటాడు. దాంతో కార్తీక్ కోపంగా ‘మధ్యలో నువ్వు ఎవడివిరా?’ అంటాడు.. ఇంతలో దీప బయటికి వచ్చి జరిగేదంతా చూస్తూ ఉంటుంది. కార్తీక్ మాత్రం దీపని గమనించకుండా సౌందర్య, ఆదిత్యలతో గొడవ పడుతూ ఉంటాడు. ఆదిత్య ఆవేశంగా ‘కట్టుకున్న పెళ్లాన్ని ఏడిపిస్తున్నావ్.. కన్న కూతుర్ని ఏడిపిస్తున్నావ్.. ఆ మౌనితని మాత్రం వదలట్లేదు..’ అంటూ కార్తీక్ మీద అరుస్తాడు.

‘ఇంత ఉందా నీ కడుపులో’ అంటాడు కార్తీక్ ‘అందరి కడుపులోనూ అంతే ఉంది’ నువ్వే.. కనిపెట్టలేక పోతున్నావ్.. అసలు ఎప్పుడైనా ఆ మౌనిత కడుపులో ఏం ఉందని నువ్వు ఆలోచించావా… అని కార్తీక్ ని నిలదీస్తుంది సౌందర్య. కార్తీక్ ఆ ‘మౌనిత నా బెస్ట్ ఫ్రెండ్..’ అంటాడు. అయితే ఫ్రెండ్ షీప్ చేయి.. వద్దనడం లేదు, హిమని కూడా దానికి దగ్గర చేయాలనీ ఎందుకు చేస్తున్నావ్’ అంటుంది సౌందర్య ఆవేశంగా.. దాంతో కార్తీక్ చాలా కోపంగా.. అయినా హిమ మౌనితకు దగ్గర అయితే మీ అందరికి ఇంత కడుపు మంట ఎందుకు ? మీరు కోరుకున్నటు ఆ వంటలక్క ఇంటికి హిమని కూడా కాదనకుండా పంపిస్తూనే ఉన్నానుగా? మీ రంతా ఒకటి అయిపోయారు మమ్మి అంటూనే దీపని చూస్తాడు.

ఇంతకన్నా ఋజువేం కావాలి ఇది(దీప) నేను లేను, రాను అన్న టైం లో మన ఇంటికి ఎందుకు వచ్చింది. మీరంతా ఒకటి అయిపోయి, దీన్ని నన్ను ఒకటి చేయడానికి ఏం పతకాలు రచిస్తున్నారో తెలుసుకోవడానికి ఇంతకన్నా సాక్షం ఏం కావాలి అని కార్తీక్ అంటాడు. దీప ‘అది కాదు.. డాక్టర్ బాబూ.. రెండు రోజులుగా మీ కోసం ఆసుపత్రికి వస్తే మీరు లేరని చెబుతున్నారు. అందుకే ఇంటికి వచ్చాను’ అంటుంది దీప. వస్తే ఏంటి నా కోడలు నా ఇంటికి వచ్చింది, వస్తే ఏంటి…? అంటుంది సౌందర్య. దాంతో కార్తీక్ ఆవేశంగా ‘మౌనితకి హిమని దగ్గరయ్యేలా నేనూ చేస్తాను’ అంటాడు. ఆదిత్య మౌనితను తిట్టడంతో కార్తీక్ ఆదిత్యను కొట్టబోతాడు.. వెంటనే సౌందర్య కార్తీకతో.. వాడిమీద చేయిపడితే బాగుండదు అంటుంది.

ఆదిత్యతో దీప.. వదిలేయ్ ఆదిత్య ఇదంతా నా వల్లే వచ్చింది.. అని చెప్పి, కార్తీక్తో హిమ మౌనిత దగ్గర కన్నా నా దగ్గరే సంతోషంగా ఉంటుంది డాక్టర్ బాబు.. అనడంతోనే కార్తీక్ దీపని బాగా తిడుతాడు. సౌందర్య ఆదిత్యలు కూడా కార్తీక్ ని బాగా తిట్టడంతో కార్తీక్ ఏడుస్తూ నాకు బుద్ధి లేదు మమ్మి మీరు ఎన్ని తిట్టనా కూడా మీ ఇంట్లోనే తింటూ, ఉంటున్నాను అంటూ ఏడుస్తూ వెళ్లి పోతుంటే.. దీప ‘డాక్టర్ బాబూ..’ అని పిలవడంతో దీప చెప్పేది వినకుండానే.. చేయి అడ్డు పెట్టి.. నీకో విషయంలో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను.. ‘నువ్వు నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావో నాకు బాగా తెలుసు.. నువ్వు నీ కూతురికి ఇచ్చిన మాట కచ్చితంగా వెనక్కి తీసుకుంటావ్. నీ జీవితంలో ఆ మాట నిలబెట్టుకోలేవు. అది గుర్తు పెట్టుకో’ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళుపోతాడు కార్తీక్. ఇక దీప బాధతో… సౌర్యకి ఇచ్చిన మాటను తలుచుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది.

మౌనిత దుర్గ అన్న మాటల గురించి ఆలోచిస్తుంది. ఇంతలో కార్తీక్ మౌనిత దగ్గరకు వెళ్లి.. ‘ఏంటి నువ్వు? అనవసరంగా మా అమ్మని అనుమానించేలా చేసావ్.. నిన్ను తిట్టిందేమో అని మా అమ్మతో గొడవ పెట్టుకున్నాను? అసలు ఎందుకు ఏడిచావ్ నువ్వు?’ అని అడుగుతాడు. దాంతో మౌనిత మనసులో.. ‘దుర్గా గాడి వల్లే ఏడ్చాను అని చెబితే వాడిని నిలదేస్తాడు. నిజం చెబితే కార్తీక్ నన్ను చంపేస్తాడు.. అలా జరగకూడదు’ అంటే.. ‘నేను ఏడవడానికి కారణం ఆంటీనే.. అని చెప్పాలి. అనుకోని మౌనిత కార్తీక్తో ఆవిడ నీకు అబద్దం చెప్పారు.. లేదంటే నేను ఏడవగానే నీకు ఎలా అర్థమౌతుంది మీ మమ్మీనే నన్ను తిట్టుంటారని? నేను చెప్పేదే నిజం.. కార్తీక్ అని అంటుంది మౌనిత.

కార్తీక్ మౌనిత దగ్గర నుండి ఆలోచించుకుంటూ వెళ్లిపోతాడు. ఇంతలో సౌర్య ఫోన్ చేసి.. ‘డాక్టర్ బాబూ మా డాడీ గురించి మీకు తెలుసంటా కదా? మా డాడీ ఎవరు డాక్టర్ బాబూ? నీకు తెలుసనీ సరోజక్క చెప్పింది’ అని అంటుంది. కార్తీక్ వెంటనే ‘నేను అర్జెంట్ సర్జరీలో ఉన్నాను’ అని ఫోన్ పెట్టేసి.. సరోజని తిట్టుకుంటాడు కార్తీక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here