90 స్పీడ్ డాన్స్ తో కిక్కెక్కించిన హీరో కార్తికేయ..

0
58

యంగ్ హీరో కార్తికేయ ప్ర‌ధాన పాత్ర‌లో శేఖ‌ర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో తెర‌కెక్కిస్తున్న చిత్రం ’90ML’. కార్తికేయ సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్‌లో వస్తున్న ఈ చిత్రానికి అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేహా సోలంకి క‌థానాయిక‌గా నటిస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన ‘సింగులు సింగులు’ సాంగ్ రికార్డు క్రియేట్ చేయగా తాజాగా ’90ML’ టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ‘టపర్ టపర్ టపర్ టపర్ 90.. 90 మార్క్స్ అంటే ఫస్ట్ అంటాను.. 90 ఏజ్ అంటే బెస్ట్ అంటాను.. 90 స్పీడ్ అంటే కిక్ అంటాను.. లైఫ్ చుట్టు తిరుగుతుంది 90-90’ అంటూ సాగే ఈ పాటను చంద్ర బోస్ రాయగా అనురాగ్ కులకర్ణి చాల బాగా పాడారు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

లవ్, ఎమోషన్స్, యాక్షన్ అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలీ, పోసాని, రావురమేష్, రవి శంకర్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here