ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ కీలక నిర్ణయం!

0
351

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి 23 రోజులవుతున్నా.. అటు కార్మికులు, ఇటు ప్రభుత్వం మధ్య పట్టు విడుపులనేవి కనిపించడం లేదు. శనివారం ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ చర్చలు విఫలమవడంతో ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆర్టీసీలో అద్దె బస్సులను పెంచేందుకు మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రైవేట్ రూట్లపై త్వరలో సర్వే నిర్వహించి రూట్లు, విధి విధానాలపై కసరత్తు చేయాలని మంత్రి, అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

ఈ నెల 28న ఆర్టీసీ కార్మికులతో జరిపిన చర్చల ఫలితాన్ని తమకు తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలను బహిష్కరించి వెళ్లిపోయారని కోర్టుకు ప్రభుత్వం నివేదిక ఇవ్వనున్నది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ కూడా సమ్మెను ఉధృతం చేయనుంది. దీనిలో భాగంగా నేడు కలెక్టరేట్ల ముట్టడితో పాటు 30న సకలజనుల సమరభేరి సభను నిర్వహించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here