ఆర్టీసీపై కేసీఆర్ సమీక్షా సమావేశం.. తీవ్ర నిర్ణయాలు తీసుకునే దిశగా యోచన

0
18

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్‌లైన్ మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. 365 మంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన విధి విధానాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ అధికారులు హాజరయ్యారు. గడువు ఇచ్చినప్పటికీ ఆర్టీసీ కార్మికులు స్పందించకపోవడంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో తీవ్ర నిర్ణయాలు తీసుకునే దిశగా కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆర్టీసీని, ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం సీఎస్‌తోపాటు ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్‌తోపాటు ఆర్టీసీ అధికారులందరూ కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ విషయమై కూడా కేసీఆర్ అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here