బస్సు చక్రాలకు బ్రేకులు.. ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ అల్టిమేటం.. సాయంత్రం లోగా!

2
331

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె తీవ్రతరమైంది. ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో బస్సు చక్రాలకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి.

మరోవైపు పండుగ సమయం కావడం, పెద్ద ఎత్తున ప్రయాణికులు బస్ స్టాండ్ లకు చేరుకోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఊళ్లకు బయల్దేరిన ప్రయాణికులు ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రభుత్వం తాత్కాలికంగా స్కూల్ బస్సులకు, ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని నడుపుతున్నప్పటీకీ పెద్దగా ప్రయోజనం లేదు. ఈ నేపథ్యంలో బస్ స్టాండ్లు, రోడ్లపై పయణికులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు.

సరిగ్గా ఈ తరుణంలో ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కార్మికులతో ఇకపై చర్చలు జరపబోమని తేల్చేసింది. చర్చల కోసం ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్‌లతో కూడిన త్రిసభ్య కమిటీని సైతం రద్దు చేసింది. దసరా పండుగ సమయంలో ఇలా కార్మికులు సమ్మెకు దిగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు అల్టిమేటం జారీ చేశారు.

ఈ రోజు (శనివారం) సాయంత్రం 6 గంటల లోపు కార్మికులందరూ విధుల్లో చేరాలని, లేని యెడల వారిని ఉద్యోగం నుంచి తొలగించినట్లుగా భావిస్తామని పేర్కొంది ప్రభుత్వం. విధులకు హాజరు కాని వారు తమ ఉద్యోగాలను స్వచ్ఛందంగా వదులుకున్నట్టే అవుతుందని స్పష్టం చేసింది. విధుల్లో చేరిన వారికి పూర్తి రక్షణ, బందోబస్తు కల్పిస్తామని హామీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here