ఆర్టీసీపై కేసీఆర్ కీలక నిర్ణయం.. కార్మికులకు డెడ్ లైన్

0
319

గత 28 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని చెప్పేశారు. మొత్తం ఆర్టీసీలో 10800 బస్సులు ఉన్నాయని.. అందులో 5100 బస్సులకు ప్రైవేట్ పర్మిట్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5 వ తేదీ లోగా విధుల్లో చేరాలని, లేదంటే ఆ తర్వాత మిగిలిన 5000 బస్సులను కూడా ప్రైవేట్ పరం చేస్తానని చెప్పారు.

ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాయలో పడి తమ భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని అన్నారు కేసీఆర్. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులు గుర్తించి విధుల్లో చేరాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నది ఇల్లీగల్ స్ట్రైక్ అని అన్నారు. ఆర్టీసీ వాళ్లకు ఇప్పటికే 67 శాతం జీతాలు పెంచామని, ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని అన్నారు. ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికులు చేసుకున్న ఆత్మహత్యలకు యూనియన్లు, ప్రతిపక్షాలు బాధ్యత వహించాలని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here