KGF డైరెక్టర్ దర్శకత్వంలో రానున్న మహేష్ 27వ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్…

9
302

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తన సిల్వర్ జూబ్లీ మూవీగా వచ్చిన “మహర్షి’ సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అయితే ప్రస్తుతం మహేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో “సరిలేరు నీకెవ్వరు” మూవీతో ఈ సంక్రాంతికి మన ముందుకి రాబోతున్నారు. ఈ చిత్రంలో రష్మిక మండన్న మహేష్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహేష్, రామ్ బ్రహ్మం సుంకర, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మహేష్ బాబుతో KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్

ఇకపోతే మహేష్ 27వ సినిమా ఎవరితో తీయబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు, KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ ను కలిసారని, వారు చెప్పిన స్టోరీ మహేష్ కు అమితంగా నచ్చడంతో, మహేష్ తన 27వ సినిమాను ప్రశాంత్ తో చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా విషయమై మరో వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే, ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ సరిగ్గా ఉంటారని ప్రశాంత్ మరియు మహేష్ ఇరువురూ భావించినట్లు సమాచారం. కాని దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here