KGF ఫేమ్ Yash మరోసారి తండ్రి అయ్యారు

0
154

‘కేజిఎఫ్’ ఫేమ్ యశ్ ప్రస్తుతం ‘కేజిఎఫ్ 2’ మూవీ లో నటిస్తున్నారు. ‘కేజిఎఫ్’ ఫస్ట్ పార్ట్ తో యశ్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. యశ్ కు ఒక 10 నెలల పాప ఉంది తన పేరు ఐరా. ఇటీవలే దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ యశ్ వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.

అయితే ప్రస్తుతం యశ్ భార్య నటి రాధికా పండిట్ బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో పండంటి బాబుకి జన్మనిచ్చారు. ఈ సంతోషకర విషయాన్ని యశ్ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు.

యశ్ నటించిన ‘కెజిఎఫ్’ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో ‘కెజిఎఫ్ 2’ కి భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఈ మూవీని బాలీవుడ్ స్టార్స్ తో, బాలీవుడ్ లెవెల్ లో, భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది ‘కెజిఎఫ్ 2’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here