KarthikaDeepam అక్టోబర్ 17 ఎపిసోడ్: నిజం చెప్పిన దీప షాక్ లో సౌందర్య…

1
851

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

కార్తీక్, హిమని కారు లో తీసుకుని షాపింగ్‌కి వెళ్తుంటాడు. మధ్యలో మౌనిత కారు ఆపుతుంది. హిమ హాయ్ డాక్టర్ అమ్మ.. అంటూ హగ్ చేసుకుంటుంది.. దీప హాస్పిటల్ అని మాట్లాడబోతుంటే మౌనితను ఆపి హిమను కారులో కూర్చోమంటే వినకపోవడంతో కారులో కూర్చో అని గట్టిగ అనడంతో వెళ్లి కారులో కూర్చుంటుంది అక్కడ ఫోన్ ఉండటం తో గేమ్ ఆడుకుంటూ ఉంటుంది హిమ.  ఇక మౌనిత ఆ దీప హాస్పిటల్ కి వచ్చి ఏం చెప్పింది అని అడగటంతో.. కార్తీక్.. ఆ వంటలక్క బర్త్ డే కి వెళితే ఎదో రహస్యం చెబుతుందట. కచ్చితంగా రమ్మని, ఆ రహస్యం వింటే మీరు చాలా రిలీఫ్ అవుతారని చెప్పింది.. అది విన్న మౌనిత ఆ దుర్గ గాడిని కూడా పిలిచి నా బండారం మొత్తం బయట పెడుతుందా.. అని టెన్షన్ పడుతుంది.

ఈ రోజు అక్టోబర్ 17 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

కార్తీక్. మౌనిత మాట్లాడుకుంటూనే… ఉంటారు.. మోనిత కార్తీక్ తో కొంపతీసి నువ్వు ఆ దీప బర్త్ డే కి వెళ్తావా.. ఆ దీప ఎంత తెలివైనదో చూసావా, నిన్ను రప్పిచడం కోసం ఎంత చీఫ్ ట్రిక్స్ ప్లే చేసిందంటే.. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి నీలో పెరిగి చచ్చినట్టు బర్త్ డే కి వస్తావన్న ఆశ ఆ దీపకి. నువ్వు గనుక అక్కడికి వెళితే అందరి ముందు సౌర్య కి తండ్రివని పరిచయం చేసి, మీ ఇద్దరు దిగిన ఫోటోలను చూపించి, మీ అమ్మని నాన్నని కూడా నిజం చెప్పమంటే వాళ్ళు చెబుతారు అప్పుడు నీ పరిస్థితి ఏంటి.. నువ్వు చెప్పేది ఎవ్వరు వినరు.. ఆలోచించుకో కార్తీక్ అంటూ కార్తీక్ ని మరింత రెచ్చకొడుతుంది మౌనిత.

సౌందర్య దీపని రెడీ చేస్తూ అక్కడున్న సరోజతో… సరోజ దీపతో వంటరిగా మాట్లాడలి అనుకుంటే ఎవరో ఒకరు వస్తున్నారు అంటే సరోజ నేను చూసుకుంటానులెండి అంటుంది. దీప సౌందర్యతో నేను ఏం నిర్ణయం తీసికున్నానో తెలుసుకోవడానికి చాలా ఆరాట పడుతున్నటున్నారు అత్తయ్య.. అంటుంది. సౌందర్య అవును అనడంతో.. దీప సౌందర్యంతో ‘హిమ నా కూతురే అని’ మీ అబ్బాయికి చెప్పబోతున్నాను అంటుంది. అదివిన్న సౌందర్య షాక్ అవుతుంది. ఏంటే.. ఈ నిర్ణయం, దీనికి ఇదా సమయం, ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు, కార్తీక్ కి ఈ నిజం చెబితే.. హిమ ఏమైపోవాలి నా కొడుకు ఏమైపోవాలి అంటుంది సౌందర్య టెంక్షన్ గా..

దీప మరి నేను నా కూతురు ఏమైపోవాలి అత్తయ్య.. హిమ 8 సం.లు నాకు దూరంగా పెరిగింది. ఇంకా 8 సం.లు ఆగమంటారా.. లేదా నా జీవితపు చివరి క్షనాలవరకు ఆగమంటారా.. నీ కొడుకు హేమ కి తన తల్లి చనిపోయిందని చెప్పాడు మరి నేను సౌర్యకు తన తండ్రి ‘చ’ అని ఆగి పోయాడని చెప్పనా.. తండ్రి దగ్గర కూతురు పెరిగితే అయ్యో తల్లి లేని పిల్ల అని జాలి పాడుతారు. అదే తల్లి దగ్గర కూతురు పెరిగితే తల్లి ఏం తప్పు చేసిందో తండ్రి వదిలేసాడు అంటారు! అన్నారు! అంటున్నారు! సౌందర్య ఎంత సర్ది చెప్పిన దీప వినిపించుకోదు.

ఆయన డీఎన్‌ఏ చేసుకోనంత కాలం మీము ఇలానే బ్రతకాలి. ఆయన
వచ్చి సౌర్యకి తండ్రి స్థానంలో నిలబడ్డాడా సరేసరి. లేకపోతే నేనెందుకు అర్ధం లేని త్యాగాలు చేయాలి. పోనివండి.. అయన రాకపోతే పోయేదేముంది నా నూరేళ్ళ సౌభాగ్యం నాకు దూరమైనది అని సరిపెట్టుకొని బ్రతికేస్తాను. దాంతో సౌందర్య ఇది కాదే పరిష్కారం. కొంచం ఓపిక పట్టవే. ఏదో ఒక మార్గం దొరక్కపోదు అంటుంది. దీప సౌందర్య మాటలు వినకపోగా ఎప్పుడు దొరుకుతుంది ఆ మార్గం. ప్రశ్న చిన్నదే.. జవాబు చిన్నదా.. అందరం కలిసి బ్రతికే దారి ఎప్పుడు దొరుకుతుంది అత్తయ్య.

హిమ నా కూతురని తెలిస్తే సౌర్యని దూరం పెట్టినట్టే హిమనీ దూరం పెడతాడని నాకు తెలుసు. అది ఎప్పటికయినా జరుగుతుంది. ఒకవేళ ఆయనే గనుక పెంచిన ప్రేమ చంపుకొని హిమనీ నా దగ్గరకు పంపిస్తే హిమకి అమ్మ నాన్న నేనే అయి పెంచుకుంటాను. అంతకు మించి ఇంకేం జరగదు అంటూ తేగేసి చెప్పేస్తుంది దీప.

ఇక మౌనిత ఇంటికి వెళ్లి టెన్షన్ పడుతూ.. కార్తీక్ మౌనితతో ఆ వంటలక్క బర్త్ డే కి వెళితే ఎదో రహస్యం చెబుతుందట. అన్న విషయాన్నీ తలుచుకుంటూ.. దీప కార్తీక్ తో ఏ విషయం చెబుతుంది.. శ్రీలతకి హిమ కార్తీక్ కూతురన్న విషయం తెలుసు. ఒకవేళ శ్రీలత ఆ డీఎన్‌ఏ రిపోర్ట్ నాకు తెలియకుండా దాచి.. ఆ దీపకి గానీ చూపించిందా.. దీప ఆ రిపోర్ట్ కార్తీక్ కి చూపిస్తే కార్తీక్ నన్ను ప్రాణాలతో బ్రతకనివ్వడు. ఒకసారి శ్రీలతకు ఫోన్ చేసి అది చెప్పిందో లేదో కనుక్కోవాలి అంటూ శ్రీలతకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడం తో మౌనిత ఇంకా టెన్షన్ పడుతుంది.

సౌందర్య దీపని చాలా అందంగా తయారు చేస్తుంది. దీపని చూసి సౌర్య ఏడుస్తూ దీపని హాగ్ చేసుకుంటుంది. అమ్మ ఎప్పుడు నాకు చాలా నమ్మకం కుదిరింది నాన్న తప్పకుండ వస్తారని సంతోషంతో మురిసిపోతుంది. అక్కడున్న అందరిని పిలిచి తన తల్లిని చూపిస్తుంది సౌర్య.అందరు చాలా సంతోష పడుతారు.

సౌందర్య కార్తీక్‌కి ఫోన్ కి ట్రై చేస్తుంది. స్విచ్ ఆఫ్ రావడంతో ఒకవేళ వైజాక్ వెళ్ళిపోతున్నాడా.. ఇక్కడికి రాడా.. భగవంతుడా అదే జరగాలి.. అదే మంచిదీ అనుకుంటూ సౌందర్య సంతోష పడుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here