కేకే నివాసానికి కొండా విశ్వేశ్వరరెడ్డి… రాజకీయవర్గాల్లో చర్చ

0
131

టీఆర్ఎస్ కీలకనేత, రాజ్యసభ సభ్యుడు కేశవరావు నివాసానికి కాంగ్రెస్ కీలకనేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టీసీ యూనియన్లు, ఉద్యోగులను కేకే చర్చలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి కేకే ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన విషయాలేమీ బయటకు రాలేదు.

కేకేతో భేటీ అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఆర్టీసీ కార్మికుల ఆవేదన టీఆర్ఎస్ నేతలకు వినిపించడం లేదన్నారు. నిన్న కేకే విడుదల చేసిన లేఖతో ఆయనను కలిశానని… ఆయన ఒక్కరు మాత్రమే మనసుతో స్పందించారన్నారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలకే కాకుండా.. టీఆర్ఎస్‌కు కూడా నష్టమేనన్నారు. సీఎం కేసీఆర్ మొండిగా ప్రవర్తిస్తున్నారన్నారని… ఆయనకు పోలీస్ శాఖ ఒక్కటి ఉంటే చాలన్నారు. సీఎం నుంచి ఆదేశాలు వస్తేనే ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరుపుతామని కేకే చెప్పారని కొండా విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here