‘అసలు విలన్ ఎవరనేది తెలుసుకోవడం చాలా కష్టం’ – ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ మూవీ పబ్లిక్ టాక్

0
246

హాస్యనటుడు గౌతమ్ రాజు కుమారుడు కృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’. ఈ చిత్రంలో ఎల్సా ఘోష్ హీరోయిన్ గా నటించారు. ఈరోజు (అక్టోబర్ 18) ఈ చిత్రాన్ని విడుదల చేసారు. ఈ సినిమాకు ఫస్ట్ షో నుండి ప్రేక్షకుల మంచి స్పందన లభిస్తోంది.

 

మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే ‘ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చాలా బాగుంది.. థ్రిల్లర్ ఎలెమెంట్స్ సినిమా సెకండ్ హాఫ్ లో విలన్ ఎవరనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు..అసలు విలన్ ఎవరనేది తెలుసుకోవడం చాలా కష్టం..సినిమా ఫస్ట్ హాఫ్ నుండి సెకండ్ హాఫ్ వరకు చాలా బాగా సస్పెన్స్ మెయిన్ టైన్ చేసారు..చిన్న బడ్జెట్ మూవీ అయినా చాలా బాగా తీశారు..ఈ మూవీ లో కృష్ణ ఫైట్స్, డాన్స్ కూడా చాల బాగా చేసాడు’ అని పబ్లిక్ టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రంలో సుమన్ కీలక పాత్ర పోషించారు. ఇంకా తనికెళ్ల భరణి, రవి ప్రకాష్, సంజు స్వరూప్, బెనర్జీ ముఖ్య పాత్రలు పోషించారు. బిజెఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. నూతన దర్శకుడు శ్రీనాథ్ పులకరం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భోలే శవాలీ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here