బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌.. ప్రమాదానికి ముందు కేటీఆర్‌కు రెండు సార్లు ట్వీట్

0
106

బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌‌ లోపాలపై విద్యాసాగర్ జగదీశన్ అనే బ్యాంకు ఉద్యోగి రెండుసార్లు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. రాయదుర్గం నుంచి హైటెక్‌ సిటీ వైపు ఉన్న ఫ్లై ఓవర్‌ చాలా వంపుతో ఉందని… ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. ఈ విషయాన్ని గుర్తించి డిజైన్‌లో మార్పులు తేవాలని ఒకసారి విద్యాసాగర్ ట్వీట్ చేశారు.

మరోసారి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముందు రోజు.. రేపు మీరు ప్రారంభించబోయే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌ మీద వంపు ఎక్కువగా ఉందని ట్వీట్ చేశారు. రంబ్లర్లను ఏర్పాటు చేయించాలని… లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కేటీఆర్‌కు విద్యాసాగర్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే కేటీఆర్.. ఈ ట్వీట్స్‌పై అసలు స్పందిచను కూడా లేదు. ఫలితంగా 20 రోజుల్లోనే ఐదు ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. ఇప్పుడు అసలు విషయాన్ని గుర్తించి అధికారులు రంబ్లర్ల ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here