మహిళా తహసీల్దార్‌ దారుణ హత్య.. రెవెన్యూ చరిత్రలోనే కనివినీ ఎరుగని ఘోరం

5
488

పట్టపగలు మహిళా తహసీల్దార్ దారుణ హత్యకు గురైంది. పెట్రోల్ పోసి నిప్పంటించి ఆమె బయటకు రాకుండా తలుపులు వేసి మరీ అమానుషం. 200 ఏళ్ల రెవెన్యూశాఖ చరిత్రలోనే ఇంతటి ఘోరం ఎప్పుడూ జరగలేదు. అది కూడా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు కూత వేటు దూరంలో ఈ ఘోరం చోటు చేసుకోవడం గమనార్హం.

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, సురేష్ అనే వ్యక్తి పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు. ఆమె మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో మాట్లాడే నెపంతో వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. మంటలు అంటుకున్న విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌, అటెండర్‌ తీవ్ర గాయాలపాలయ్యారు. డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు సురేశ్‌ కూడా మంటలు అంటుకుని గాయపడ్డాడు.

భూమి రాకుండా అడ్డుపడుతోందనే కారణంతోనే హత్య చేసినట్టు తెలుస్తోంది. పెట్రోల్‌ను తహసీల్దార్ విజయారెడ్డిపై పోసి లైటర్‌తో నిప్పంటించి పూర్తిగా కాలిపోయే వరకూ సురేష్ గడియ వేసి అక్కడే ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో అతనికి మంటలు అంటుకోవడంతో బయటకు పరుగులు పెట్టాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here