‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ప్లస్‌‌లు.. మైనస్‌లు!

0
225

టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో తప్ప ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సినిమా చూసిన ప్రతి అభిమాని, సినీ ప్రియులు సూపర్బ్ అని అంటున్నారు. మరోవైపు ఏపీలో రిలీజ్ కాకుండా చేసినందుకుగాను అటు సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

అయితే సినిమా ఎలా ఉంది? ఆర్జీవీ ఏ విధంగా తెరకెక్కించారు..? సినిమాకు ప్లస్‌‌లేంటి..? మైనస్‌లేంటి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్లస్ పాయింట్స్..
కథ, కథనాలు
ఎమోషనల్ సీన్స్‌
సంగీతం ఇరగదీశారు..
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్టాఫ్ చాలా బావుంది
ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది

మైనస్ పాయింట్స్..
సెకండాఫ్ స్లోగా ఉంది
అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు కాస్త ఓవర్ అనిపించాయి
ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఉండే సాంగ్ కాస్త లాజిక్‌లెస్, ఓవర్ అనిపించింది.

ఫస్టాప్ మొత్తం..
సినిమా స్టార్ట్ అయ్యింది మొదలుకుని ఇంటర్వెల్ వరకు మొత్తం లక్ష్మీపార్వతి గురించే ఉంది. 1989లో అధికారం కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్ జీవితం, ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశంతో సినిమా ఆరంభం అవుతుంది.? లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ మధ్య బలపడిన బంధం, భర్త వీరగ్రంథం సుబ్బరావుతో లక్ష్మీపార్వతి అనుబంధం అంశాలతో సినిమా చాలా హోమ్లీగా ఉన్నట్లు ఆర్జీవీ తెరకెక్కించారు. ఆర్జీవీ ఇదివరకటి సినిమాల్లో మాదిరిగా ఇందులో ఎలాంటి అసభ్య సన్నివేశాలకు చోటు ఇవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మిస్టర్ క్లీన్ సన్నివేశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫస్టాప్ మొత్తమ్మీద ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ఎమోషన్స్ ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఉంటాయి. దీంతో తర్వాత ఏం జరుగుతుంది..? వాట్ నెక్స్ట్ వాట్ నెక్ట్ట్ అని సర్వాత్రా ఆసక్తి పెరుగుతుంది.

సెకండాఫ్..
ఎన్టీఆర్.. రెండోసారి అధికారంలోకి రావడానికి కర్త, కర్మ, క్రియ లక్ష్మీ పార్వతేనని ఈ సినిమా ద్వారా ఆర్జీవీ చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు ఎన్టీఆర్ కుటుంబాన్ని బాబు ఎలా తన చేతుల్లోకి తీసుకొన్నాడు..? ఎమ్మెల్యేలను తన దారిలోకి తెచ్చుకోవడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఏంటి..? ముఖ్యంగా వైశ్రాయ్ హోటల్ జరిగిన ఉదంతమేంటి..? అసలు హోటల్ ఏం జరిగింది..? విజయవాడలో సింహగర్జన మీటింగ్ పెట్టుకోవడానికి అడ్డు తగిలిందెవరు..? ఇలా అన్ని సన్నివేశాలను ఆర్జీవీ చాలా చక్కగా.. ఎమోషనల్‌గా చూపించారు.

చివర్లో ఒక్క మాట: ఎన్టీఆర్ పడిన మానసిక క్షోభ ప్రేక్షకుడిని భావోద్వేగానికి, కంటతడి పెట్టించేలా చేశారు ఆర్జీవీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here