మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంతో రసవత్తరంగా జరిగాయి. శివాజీ రాజీ- నరేశ్ ప్యానెళ్ల మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో నరేష్ సాధించారు. శివాజీ రాజాకు 199 ఓట్లు పోలు కాగా నరేశ్‌కు 268ఓట్లు పోలయ్యాయి. దీంతో 69 ఓట్ల ఆధిక్యంతో నరేశ్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎగ్జిక్యూటీవ్ వైఎస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌పై హీరో రాజశేఖర్ విజయం సాధించారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లుగా ఎస్వీ కృష్టారెడ్డి, హేమ గెలుపొందగా.. జనరల్ సెక్రటరీగా రఘుబాబుపై జీవితారాజశేఖర్ విజయం సాధించారు. ట్రెజరర్‌గా రాజీవ్ కనకాల గెలుపొందగా.. జాయింట్ సెక్రటరీలుగా గౌతమ్ రాజు, శివబాలాజీ గెలిచారు. ఇక శివాజీరాజా ప్యానల్ నుంచి మా కమిటీ మెంబర్ గా నిర్మాత, పీఆర్ఓ సురేష్ కొండేటి విజయం సాధించడం విశేషం. ఆయనకు 264 ఓట్లు పడ్డాయి. కమిటీ మెంబర్ గా ఆయన 8 వ స్థానంలో నిలిచారు.
‘మా’ అసోసియేషన్‌లో మొత్తం 745 ఓట్లు ఉండగా 472 మంది తమ ఓటును వినియోగించుకున్నారు. ‘మా’ ఎన్నికల చరిత్రలో అధికంగా పోలింగ్ నమోదవడం ఇదే తొలిసారి.
గెలుపొందిన ‘మా’ కమిటీ మెంబర్స్.లిస్ట్
1). అలీ
2). రవిప్రకాష్
3). తనికెళ్ల భరణి
4). సాయికుమార్
5). ఉత్తేజ్
6). పృథ్వి
7). జాకీ
8).సురేష్ కొండేటి
9). అనితా చౌదరి
10). అశోక్ కుమార్
11). సమీర్
12). ఏడిద శ్రీరామ్
13).రాజా రవీంద్ర
14). తనీష్
15). జయలక్ష్మి
16). కరాటి కళ్యాని
17). వేణుమాధవ్
18). పసునూరి శ్రీనివాస్