బాలీవుడ్‌ లో రణ్‌వీర్ సింగ్​తో మహేష్ బాబు..

0
179

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇద్దరూ కలిసి మల్టీస్టారర్‌లో యాక్ట్‌ చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి ముంబైలో ఓ ప్రముఖ కూల్ డ్రింక్ వ్యాపార సంస్థ రూపొందిస్తున్న వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నారు. ఈ షూటింగ్ పూర్తి కాగానే ప్రముఖ ప్రొడ్యూసర్‌‌ సాజిద్‌ నడియావాలా నిర్మించే సినిమాకు సంతకం చేయబోతున్నారని తెలుస్తోంది.

Image result for రణ్​వీర్​ సింగ్​ మహేశ్

టాలీవుడ్, బాలీవుడ్ హీరోలతో కలిసి హిందీలో ఓ ఫీచర్ ఫిల్మ్ చేయాలనీ సాజిద్ చాలా రోజుల నుండి ప్లాన్ చేస్తున్నాడట. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ వీళ్లిద్దరు కలిసి చేయబోయే సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఈ ఇద్దరూ మనస్తత్వం వేరు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా నిదానంగా, రిజర్వ్‌డ్‌గా ఉంటే.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ మాత్రం తెగ అల్లరి చేస్తూ అందరితో ఇట్టే కలిసిపోతాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here