నీ మాస్ లుక్ మైండ్ బ్లాక్: మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్ సింగిల్

0
63

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రతి సోమవారం ఈ చిత్రం నుండి అభిమానులకు సర్ ప్రైజ్ ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే ఈరోజు డిసెంబర్ 2 సోమవారం సాయంత్రం ఈ మూవీ నుండి ఫస్ట్ సింగల్ ‘మైండ్ బ్లాక్’ లిరికల్ సాంగ్ ని విడుదల చేసారు. ‘ఎపుడూ ప్యాంటు ఏసేవాడు.. ఇప్పుడు లుంగీ కట్టాడు.. ఎపుడూ షర్ట్ ఏసేవాడు.. ఇప్పుడు జుబ్బా తొడిగాడు.. మైండ్ బ్లాక్.. నీ మాస్ లుక్ మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్.. నువ్వొక స్టెప్ వేస్తే మైండ్ బ్లాక్..’ అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి, దేవి శ్రీ ప్రసాద్ లిరిక్స్ రాయగా బ్లేజ్ మరియు రానిన రెడ్డి పాడారు.

విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఘట్టమనేని మహేష్ బాబు దిల్ రాజు అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here