మహేష్ బాబు, “సరిలేరు నీకెవ్వరు” మూవీ విడుదల తేదీ ఖరారు…

2
409

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. చిత్ర బృందం, ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనుందని చెప్పారు, కానీ తేదిని నిర్ణయించలేదు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని జనవరి 11, 2020 న విడుదల చేయనున్నారని సమాచారం. కానీ ఈ తేదీని వారు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

అదే సమయంలో అల్లు అర్జున్, “అల వైకుంఠపురంలో” మరియు బాల కృష్ణ, “NBK 150” చిత్రాలు విడుదల కానున్నాయి. 3 చిత్రాలు ఒకే సీజన్ లో విడుదల అవబోతుండటంతో, ఈ మూవీ రేస్ లో ఎవరు గెలుస్తారనే ఆతృత మొదలైంది.

“సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో మహేష్ బాబు ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటి విజయశాంతి చాలా కాలం తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ఘట్టమనేని మహేష్ బాబు, దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం జనవరి 11,2020 న సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here