బొమ్మ దద్దరిల్లిపోయింది.. ‘సరిలేరు నీకెవ్వరు’ రివ్యూ

13
747

చిత్రం: సరిలేరు నీకెవ్వరు
నటీనటులు: మహేశ్‌బాబు, రష్మిక, విజయశాంతి, ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్‌, సత్యదేవ్‌, అజయ్‌, సుబ్బరాజు, నరేశ్‌, రఘుబాబు, బండ్ల గణేశ్‌, సంగీత, హరితేజ, తమన్నా
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: ఆర్‌. రత్నవేలు
ఎడిటింగ్‌: తమ్మిరాజు
నిర్మాత: అనిల్‌ సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు
రచన, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి
బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్‌
విడుదల తేదీ: 11-01-2020

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో చేస్తున్న తొలి చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఈరోజు వరల్డ్ వైడ్ గా విడుదలైంది. రష్మిక మండన్న హీరోయిన్. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

కథ: మహేష్ బాబు మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణగా ఎంట్రీ ఇస్తారు. మెడికల్ కాలేజీ లో ప్రొఫెసర్ భారతి (విజయశాంతి) కి దేశ భక్తి ఎక్కువ అందుకే తన ఇద్దరు కొడుకులను మిలిటరీకి పంపిస్తుంది. కొందరు ఉగ్రవాదులు స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేస్తారు. వారి నుండి పిల్లలని కాపాడటానికి స్పెషల్ ఆపరేషన్ తో మహేష్ బాబు తన టీం రంగంలోకి దిగుతారు. ఈ ఆపరేషన్ లో విజయశాంతి రెండవ కొడుకు అజయ్ (సత్యదేవ్) తీవ్రంగా గాయపడతాడు. ఈ విషయాన్ని విజయశాంతికి తెలియజేయడం కోసం కర్నూలుకి బయలుదేరుతాడు మహేష్. తర్వాత ఏం జరిగింది? సంస్కృతి (రష్మిక) ఎవరు? మంత్రి నాగేంద్రప్రసాద్ (ప్రకాష్ రాజ్) ఎవరు? అసలు భారతికి, నాగేంద్రప్రసాద్, అజయ్ ల మధ్య పోరు ఎందుకు జరిగిందనేది తెరపై చూడాల్సిందే?

వివరణ: స్కూల్ పిల్లలను ఉగ్రవాదుల నుండి మేజర్ అజయ్ కృష్ణ టీం చేసే ఆపరేషన్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ చాలా ఆకట్టుకుంటాయి. తర్వాత అనుకోకుండా మహేష్ విజయశాంతి కోసం కర్నూలు వెళ్లవలసి వస్తుంది. ట్రైన్ లో రష్మిక ఫ్యామిలీతో ఎంట్రీ మరియు బ్లేడ్ గ్యాంగ్ గా బండ్ల గణేష్ చేసే కామెడీ అందరినీ అలరిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగుతుంది. తర్వాత అజయ్ కర్నూలులోకి దిగాక విజయశాంతి ఫ్యామిలీ కనపడకపోయేసరికి అసలేం జరిగిందని తెలుసుకుని ఒక మర్డర్ కేసు లో విజయశాంతికి, ప్రకాష్ రాజ్ కి మధ్య జరిగే పోరులోకి మహేష్ రావడం ఇలా సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా నడుస్తుంది. క్లైమాక్స్ కూడా అన్ని సినిమాల్లో లానే ఉంది. సినిమా దాదాపు 3 గంటల నిడివితో ఉంది.

ఎవరు ఎలా చేసారంటే: సూపర్ స్టార్ మహేష్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ యాక్షన్ సీన్స్, డాన్స్, ‘మైండ్ బ్లాక్’ సాంగ్ లో ఆయన మాస్ లుక్, ప్రకాష్ రాజ్ తో ఆయన పంచ్ డైలాగ్స్, కామెడీ టైమింగ్ అన్నీ చాలా చాలా బాగా చేసారు. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన ‘విశ్వ భారతి’ విజయశాంతి తన నటన, డైలాగ్ డెలివరీ, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో అప్పటి విజయశాంతిని మళ్లీ గుర్తు చేసారు. ప్రకాష్ రాజ్ మళ్లీ పవర్ఫుల్ ప్రతినాయకుని పాత్రలో అందరినీ మెప్పించారు. వీరి ముగ్గురు పాత్రలు మూవీకి హైలైట్. మిలిటరీ ఎపిసోడ్ లో తమన్నా ‘డాంగ్ డాంగ్’ సాంగ్ లో తన డాన్స్ తో అదరగొట్టింది. అజయ్ ని ప్రేమించే సంస్కృతి పాత్రలో రష్మిక తన ఫ్యామిలీగా రాజేంద్ర ప్రసాద్, సంగీత, హరితేజ, దొంగగా బండ్ల గణేష్, క్రైమ్ బ్రాంచ్ కోటిగా సుబ్బిరాజు, వెన్నెల కిషోర్ ల కామెడీ కడుపుబ్బ నవ్విస్తుంది. క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ సాధారణంగా అనిపిస్తుంది. ఎడిటింగ్ అంతంత మాత్రంగానే అనిపిస్తుంది.

సాంకేతికత: ఈ మూవీలో ‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్ ముఖ్యంగా ఆర్మీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలకు యాక్షన్‌ సీన్‌లను నేపథ్య సంగీతం అద్భుతంగా ఎలివేట్‌ చేసారు దేవి శ్రీ ప్రసాద్. పార్టీ సాంగ్‌ ‘డాంగ్‌ డాంగ్‌’ ‘హీ ఈజ్‌ సో క్యూట్‌’ ‘సూర్యుడివో.. చంద్రుడివో’ పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకొంచెం చేసుంటే బాగుండేది. ప్రతి ఫ్రేమ్‌లోనూ భారీతనం కనిపిస్తుంది. ముగ్గురు నిర్మాతలు కావడం.. మహేష్ బాబు హీరో అవడంతో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా చాలా బాగా తీశారు. మహేశ్‌ అత్యంత త్వరగా పూర్తి చేసిన సినిమా ఇదే కావడం విశేషం. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాగుంది.

ప్లస్ పాయింట్స్:

మహేష్ బాబు
విజయశాంతి
ప్రకాష్ రాజ్
కామెడీ
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్
ఎడిటింగ్
క్లైమాక్స్

రివ్యూ: బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు.. బొమ్మ దద్దరిల్లిపోయింది..!

రేటింగ్: 3.5/5

 

13 COMMENTS

  1. buy chloroquine

    బొమ్మ దద్దరిల్లిపోయింది.. 'సరిలేరు నీకెవ్వరు' రివ్యూ | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here