ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై మంచు విష్ణు ఫైర్

0
136

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మంచు విష్ణు నేడు ట్విటర్ వేదికగా మండిపడ్డారు. నోరుంది కదాని ఊరికే పారేసుకోకండి అంటూ హెచ్చరించారు. ఇటీవల బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. మేజర్ చంద్రకాంత్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన మోహన్‌బాబు.. ఎన్టీఆర్‌కు పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆరోపించారు. ఆయన ఉత్తముడంటూ లక్ష్మీ పార్వతి ప్రకటిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. మోహన్‌బాబును బుద్దా వెంకన్న ఊసరవెల్లితో పోల్చారు. దీనిపై మంచు విష్ణు ట్విటర్ వేదికగా స్పందించారు.. ‘‘టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు నోరు ఉంది కదా అని ఊరికే పారేసుకోకండి.. ఎలెక్షన్స్ ఉండేది ఇంకో పది రోజులే.. దాని తర్వాత.. మీరు మా ఇంటికి రావాలి.. మేము మీ ఇంటికి రావాలి.. ఒకళ్లనొకళ్లు ముఖాలు చూసుకోవాలి. ఎలక్షన్స్‌లో మీరూ విమర్శించొచ్చు.. మేము మిమల్ని విమర్శించొచ్చు, కానీ డీసెన్సీ ఉండాలి. అన్నిటికీ ఒక హద్దు ఉంటుంది. నెల రోజుల ముందు తిరుపతికి వచ్చి మా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడారో మర్చిపోకండి’’ అంటూ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here