జార్జ్ రెడ్డి, శ్రీముఖి, సుధీర్ లను ఛాలెంజ్ చేసిన మంగ్లీ..

3
453

పలు సెలెబ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటి చెట్ల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. తెలంగాణలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు మణికొండలో జిహెచ్ఎంసి పార్కులో ప్రముఖ సింగర్ మంగ్లీ మూడు మొక్కలను నాటి.. మొక్కల యొక్క ప్రాముఖ్యతను తెలిపారు.

ఈ సందర్బంగా మంగ్లీ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు మన పూర్వీకులు ఎండాకాలం వచ్చిందంటే చెట్ల కింద కూర్చుని చల్లని వాతావరణాన్ని ఆస్వాదించేవారు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో చెట్లు అంతరించిపోయాయి. దీంతో కాలుష్యం పెరిగి భూమి వేడెక్కుతోంది.’ అన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జోగినపల్లి సంతోష్ కి కృతఙ్ఞతలు తెలిపింది. తర్వాత మంగ్లీ ఈ ఛాలెంజ్ ను సుడిగాలి సుధీర్, యాంకర్ శ్రీముఖి, ‘జార్జ్ రెడ్డి’ హీరో సందీప్ మాధవ్ లను ఛాలెంజ్ చేసారు.

3 COMMENTS

  1. Youre so cool! I dont suppose Ive learn something like this before. So nice to find anyone with some original ideas on this subject. realy thanks for beginning this up. this web site is something that is wanted on the internet, someone with a little bit originality. useful job for bringing something new to the internet!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here