ఆర్టీసీ కార్మికులకు ప్రజాపక్షం మేడ్చల్ బ్యూరో చీఫ్ సపోర్ట్

0
149

ఆర్టీసీ కార్మికులు గత 45 రోజులుగా చేస్తున్న సమ్మెకు టియుడబ్ల్యుజె జిల్లా అధ్యక్షులు మోతె వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి మల్కయ్య సంఘీభావం తెలియజేశారు. అదే విధంగా కార్మికులకు మేడ్చల్ జిల్లా *ప్రజాపక్షం* ప్రతినిధి టి మల్కయ్య ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాత్రికేయులు ఆర్ మల్లేష్ గౌడ్, ఎం డి అక్బర్, రుద్రగోని నర్సింగ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సిపిఐ కాప్రా సమితి నుండి ఆర్టీసీ కార్మికులకు 2 క్వింటాళ్ల బియ్యం, ECIL కంపెనీ AITUC యూనియన్ నుంచి క్వింటా బియ్యం మరియు మేడ్చల్ జిల్లా ప్రజాపక్షం ప్రతినిధి మల్కయ్య ఆధ్వర్యంలో మరో 2 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేసారు.

అంతేకాకుండా కల్పతరువు ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తల్లావజ్జుల కమల్ పంత్ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు. TUWJ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మోతె వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్కయ్య దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆర్టీసీ కార్మికులకు తమ సంఘీభావాన్ని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here