నాగబాబు పుట్టినరోజున ఒకే వేదికపై సందడి చేసిన మెగా ఫ్యామిలీ

0
326

అక్టోబర్ 29 మంగళవారం రోజున మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు పుట్టినరోజు సందర్బంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి తన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత, శ్రీజ, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్ దంపతులు, నిహారిక, వరుణ్ తేజ్..మెగా ఫ్యామిలీ ముఖ్యులంతా ఒకే వేదికపై చేరి సందడి చేసారు. దీంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఈ ఫోటోలకు తెగ లైకులు కొడుతున్నారు.

నాగబాబు ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ‘సైరా నరసింహ రెడ్డి’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152 వ చిత్రాన్ని చేయనున్నారు.

మరోవైపు రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RRR’ మూవీలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇంకా అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల.. వైకుంఠపురములో..’ మూవీలో నటిస్తున్నారు. అంతేకాకుండా సుకుమార్ దర్శకత్వంలో కూడా మరో సినిమాను చేయనున్నారు. ఇక వరుణ్ తేజ్, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఒక బాక్సర్ గా కనిపించబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here