మెగా స్టార్ చిరంజీవి, “సైరా” ప్రీ రిలీజ్ ఈవెంట్…చిరంజీవి స్పీచ్

8
440

మెగా స్టార్ చిరంజీవి నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “సైరా” నరసింహా రెడ్డి, అక్టోబర్ 2 న ప్రేక్షజకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి, ఆదివారం హైద్రాబాదులోని ఎల్.బి స్టేడియంలో “సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్” ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చిరంజీవి తన 41 ఏళ్ళ ప్రస్థానాన్ని ప్రస్తావించారు.

ఈ సందర్బంగా చిరంజీవి, “సెప్టెంబర్22 నా జీవితంలో ఒక అద్భుతమైన ల్యాండ్ మార్క్. ఎందుకంటే, 1978 సెప్టెంబర్ 22 నా మొదటి సినిమా “నా ప్రాణం ఖరీదు” రిలీజ్ అయింది. ఆరోజు నాలో టెన్షన్, ఎక్సయిట్మెంట్, ఉద్విఘ్నత ఎలా ఉన్నాయో మళ్ళీ ఈరోజు అలానే ఉంది. దీనికి కారణం “సైరా”.

ఎప్పటినుంచో నాకు భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య సమరయోధుని పాత్ర చేయాలని ఉండేది. కానీ ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కానీ, నిర్మాత గాని అటువంటి పాత్ర తీసుకురాలేదు. అయితే 12 ఏళ్ల క్రితం పరుచూరి వెంకటేశ్వర్రావు గారు నరసింహా రెడ్డి అనే ఒక యోధుడు, మొట్ట మొదటి స్వాతంత్ర్య సమరయోధుని గురించి సినిమా తీస్తే బాగుండునని చెప్పారు.

ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి అప్పట్లో 60 -70 కోట్ల దాకా ఖర్చవుతుంది. అంత బడ్జెట్ పెట్టగల నిర్మాతలు లేకపోవడం వలన ఆగిపోయింది. కానీ ఈరోజు ఈ విధంగా “సైరా” తెరకెక్కడానికి పరోక్షంగా సహాయం చేసిందీ, ధైర్యాన్ని ఇచ్చిందీ రాజమౌళి గారే. అయన తీసిన బాహుబలి మూవీ స్ఫూర్తితోనే “సైరా” మూవీ తెరకెక్కింది. అందుకే రాజమౌళికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాతో నా కల తీరింది.

ఈ సినిమా తీయడానికి బడ్జెట్ పెట్టడానికి రామ్ చరణ్ ముందుకొచ్చాడు. ఎక్కడా తగ్గకుండా సినిమా అద్భుతంగా తీయాలని రామ్ చరణ్ అన్నాడు. తర్వాత నరసింహా రెడ్డి గురించి ఉన్న కథనాలను, అక్కడి హిస్టోరియల్స్ ను అడిగాం. ఎంపీ గారిని కలిసాం, అయన మీద రాసిన పుస్తకాలను చూసాం. తర్వాత ఈ సినిమాకి డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి అయితే బాగుంటుందని రామ్ చరణ్ అన్నాడు.

మంచి కథనంతో ఒక యథార్థ గాథని ఎక్కడా వక్రీకరించకుండా కమర్షియలైజ్ గా చాలా చక్కగా సురేందర్ రెడ్డి గారు తెరకెక్కించారు. హ్యాట్సాఫ్ సురేందర్ రెడ్డి” అని చెప్పుకొచ్చారు.

ఈ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతాన్ని అందించారు. అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here