సైరా నుండి చిరంజీవి, తమన్నాల డ్యూయెట్ సాంగ్..

0
319

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ మూవీ అక్టోబర్ 2 న విడుదలై సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఒక స్వాతంత్ర్య సమర యోధుని జీవిత కథ ఆధారంగా రూపొందించింది కనుక కొన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ కి హద్దులుంటాయి.

అందులో ఒకటి సైరా నరసింహ రెడ్డి, లక్ష్మిల ప్రేమ విషయం. ఈ చిత్రంలో చిరంజీవి, తమన్నాల డ్యూయెట్ సాంగ్ ఒకటి తీసారట కానీ చిరంజీవి కారక్టరైజేషన్ కు ఎటువంటి నష్టం జరగకుండా మూవీ ఎడిటింగ్ లో ఆ సాంగ్ ని తీసేసారు.

ఈ సాంగ్ ని 8 కోట్లు ఖర్చుపెట్టి తీశామని ప్రొడ్యూసర్ రామ్ చరణే స్వయంగా తెలిపారు. ఇప్పుడు ఆ డ్యూయెట్ సాంగ్ ని ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారట. ఈ సాంగ్ ని కోరియోగ్రఫీ చేసింది శివ శంకర్ మాస్టర్. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here