మెగాస్టార్ చిరంజీవి ”సైరా” నరసింహ రెడ్డి మూవీ 5 వ రోజు వసూళ్లు…

0
250

మెగాస్టార్ చిరంజీవి 12 ఏళ్ల డ్రీం ప్రాజెక్ట్ ”సైరా” నరసింహ రెడ్డి అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చి 3 రోజుల్లో 100 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ మూవీ గా సంచలనం సృష్టించింది. సినిమా రిలీజ్ అయిన 5 వ రోజు వరకు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బాహుబలి-2 తర్వాత రెండవ చిత్రంగా ”సైరా” సంచలనం సృష్టించింది.

ఆదివారం రోజున, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్లు వసూళ్లు రాబట్టింది. వచ్చే సెలవు రోజుల్లో కూడా సైరా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని అంచనా. ఒక్క తెలుగు రాష్ట్రాల నుండే రూ. 75 కోట్ల షేర్ రాబట్టిందని రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఇదిలా ఉండగా చెన్నై లో మాత్రం కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

జోకర్ – 20 లక్షలు
వార్ – 19 లక్షలు
సైరా – 15 లక్షలు

5 రోజుల టోటల్ గ్రాస్ వివరాలు ఇలా ఉన్నాయి.
జోకర్ – 1.01 కోట్లు
వార్ – 1 కోటి
సైరా – 81 లక్షలు

స్వాతంత్ర్య సమర యోధుని అసలు కథ ఆధారంగా తీసిన సినిమా ”సైరా” నరసింహ రెడ్డి. దాదాపు రూ. 280 కోట్ల భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here