తహసీల్దార్ దారుణ హత్య.. ఎవరా మంత్రి? ఎవరా నేతలు?

0
20

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించి అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణహత్యోదంతం వెనుక కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. భూవివాదమే విజయారెడ్డి హత్యకు కారణమని తెలుస్తోంది. అయితే ఈ భూ వివాదం వెనుక ఒక మంత్రితో పాటు కొందరు రాజకీయ నాయకుల హస్తమున్నట్టు తెలుస్తోంది.

మొత్తంగా ఈ వ్యవహారం విజయారెడ్డి హత్యకు కారణమైందని సమాచారం. భూవివాదంపై నిందితుడు సురేష్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల కోసం తహసీల్దార్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయమై తహసీల్దార్‌ తనకు అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతోనే హత్య చేశాడు. అయితే 1990 నుంచి ఈ భూములపై వివాదాలు కొనసాగుతున్నాయి. 2004 తర్వాత భూములపై కొందరు రాజకీయ నేతల కళ్లు పడ్డాయి. వివాదస్పదమైన భూముల వ్యవహారంలో కొందరు పెద్దలు తల దూర్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భూములు కొన్న పెద్దలు అనుకూలంగా రికార్డులు మార్చాలని అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చారని సమాచారం. 120 ఎకరాల వివాదంపై హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ 120 ఎకరాల్లో కౌలుదారుల చేతిలో 77 ఎకరాలు.. పట్టాదారుల ఆధీనంలో 42 ఎకరాలు ఉన్నాయి. వివాదాస్పద భూముల వ్యవహారంలో ఒక మంత్రి పేరు.. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు చెందిన కొందరు రాజకీయ నేతలు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ మంత్రి ఎవరు? ఆ నేతలు ఎవరు? అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here