నాగార్జునకు ట్వీట్ చేసిన ప్రధాని మోడీ

0
234

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా ఓటు హక్కు వినియోగంలో వెనుక బడిన ఓటర్లను చైతన్య పర్చలాంటూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు మోడీ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో.. తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లను చైతన్య పర్చాలంటూ నాగార్జునకు మోడీ సూచించారు.

”గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సినిమాల ద్వారా ఎన్నో లక్షల మంది ఆధారాభిమానాలు సంపాదించారు. అలాగే పలు అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరిగేలా ఓటర్లను చైతన్య పరచాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని ట్వీట్‌లో పేర్కొన్నారు మోడీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here