మోహన్ బాబుకు షాక్! ఏడాది జైలు శిక్ష

0
190

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్షను విధించింది హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు. దీంతోపాటుగా రూ. 41.75 లక్షల జరిమానాను కూడా విధించింది. గతంలో సినీ దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి.. మోహన్ బాబుపై ఈ చెక్ బౌన్స్ కేసు వేశారు. 2010 సంవత్సరంలో ఈ అంశానికి సంబంధించి కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే తాజాగా మంగళవారం నాడు ఈ కేసు విషయమై ఎర్రమంజిల్ 23 కోర్టు జడ్డిజ వి. రఘునాథరావు తీర్పు వెలువరించారు.

వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘సలీం’ చిత్రానికి గాను నిర్మాతగా వ్యవహరించిన మోహన్‌బాబు ఆయనకు ఈ చెక్ ఇచ్చారు. తీరా బ్యాంకుకు వెళ్ళాక మోహన్ బాబు ఇచ్చిన ఆ చెక్ చెల్లకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. వైవీఎస్ పెట్టిన ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, ఏ2గా మోహన్ బాబు ఉన్నారు. మొత్తం రూ. 48 లక్షల చౌక్ బౌన్స్ జరిగిందని పేర్కొంటూ వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఉదంతం పట్ల మంచు మోహన్ బాబు స్పందిస్తూ ఈ వార్త తనను బాగా డిసప్పాయింట్ చేసిందని, తాను ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో ఉన్నానని పేర్కొన్నారు.

ఇటీవలే వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సమక్షంలో మోహన్ బాబు వైసీపీలో చేరారు. మోహన్ బాబు వైసీపీలో చేరిన వెంటనే ఇలాంటి పాత కేసులన్నీ తోడుతుండటంతో అటు మంచు అభిమానులు.. ఇటు వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు కావాలనే ఇలాంటి వాటిని తవ్వుతున్నారని వారు వాపోతున్నారు. చూడాలి మరి ఈ ఉదంతం ఎంత వరకు వెళ్లనుందో! మొత్తానికైతే ఇది మోహన్ బాబుకు, ఒకరకంగా వైసీపీకి కూడా ఎదురుదెబ్బే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here