KarthikaDeepam అక్టోబర్ 4 ఎపిసోడ్‌: మౌనిత సౌందర్యంపై మరో కుట్ర.

0
103

గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంట..

మౌనిత దుర్గ అన్న మాటల గురించి ఆలోచిస్తుంది. ఇంతలో కార్తీక్ మౌనిత దగ్గరకు వెళ్లి.. ‘ఏంటి నువ్వు? అనవసరంగా మా అమ్మని అనుమానించేలా చేసావ్.. నిన్ను తిట్టిందేమో అని మా అమ్మతో గొడవ పెట్టుకున్నాను? అసలు ఎందుకు ఏడిచావ్ నువ్వు?’ అని అడుగుతాడు. దాంతో మౌనిత మనసులో.. ‘దుర్గా గాడి వల్లే ఏడ్చాను అని చెబితే వాడిని నిలదేస్తాడు. నిజం చెబితే కార్తీక్ నన్ను చంపేస్తాడు.. అలా జరగకూడదు’ అంటే.. ‘నేను ఏడవడానికి కారణం ఆంటీనే.. అని చెప్పాలి. అనుకోని మౌనిత కార్తీక్తో ఆవిడ నీకు అబద్దం చెప్పారు.. లేదంటే నేను ఏడవగానే నీకు ఎలా అర్థమౌతుంది మీ మమ్మీనే నన్ను తిట్టుంటారని? నేను చెప్పేదే నిజం.. కార్తీక్ అని అంటుంది మౌనిత.

ఈ రోజు అక్టోబర్ 4 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

సౌందర్య హిమకు హోమ్ వర్క్ రాయిస్తూ ఉంటుంది. ‘అబద్దం ఆడరాదు.. అసత్యం పలకరాదు’ అంటూ బుక్ లో ఉన్నది చెప్పి రాయిస్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. సౌందర్య చెపింది విని, మౌనిత చెప్పిన అబద్దాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పుస్తకాల్లో ఉన్నవన్నీ ఆచరించాలంటే చాలా కష్టం హిమ.. అవన్నీ మీ నానమ్మకె సాధ్యమౌతాయి అంటూ కార్తీక్ సౌందర్యని కావాలనే దెప్పిపొడుస్తాడు. దాంతో సౌందర్య కూడా కార్తీక్ పై రివర్స్ పంచ్‌లు వేస్తుంది. అప్పుడే..హిమా.. ‘డాడీ.. సౌర్య ఫోన్ చేసింది.. వాళ్ల డాడీ గురించి మీకు తెలుసట కదా..? బర్త్క డే కి ఎప్పుడు వస్తాడో కనుక్కుని చెప్పమంది’ అంటుంది. దాంతో కార్తీక్ హిమకి బుక్ అవుతాడు. ఎప్పుడు చెప్పారా అడుగుతుందిగా చెప్పు అంటుంది సౌందర్య.. కార్తీక్ ఏమి చెప్పకుండా హిమ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు అని మాట మార్చి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

సౌర్య ‘నాన్నకు స్వాగతం’ అనే వెల్‌కమ్ బోర్డ్ తయారు చేస్తుంది. అది చూసిన దీప.. కార్తీక్ అన్నది తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అబ్బా ఇంకా ఫోన్ రాలేదేంటీ.. అని అంటుంది సౌర్య.. ఎవరు చేస్తానన్నారమ్మా అని దీప అడుగుతుంది. హిమనీ నాన్న గురించి డాక్టర్ బాబుని అడిగి తెలుసుకుని చెప్పమన్నాను.. కానీ హిమ ఇంకా ఫోన్ చేయలేదు’ అంటుంది సౌర్య దీపతో.. దీపని సౌర్య వాళ్ళ నాన్న గురించి ప్రశ్నలు వేసిన జవాబులు చెప్పకుండా సౌర్యకి నచ్చజెప్పి పాడుకోబెడుతుంది.

కార్తీక్ కి సౌర్య ఫోన్ చేసి వాళ్ళ నాన్న గురించి అడిగింది గుర్తు చేసుకుంటూ.. ‘ ఏమనుకుంటుందో ఆ దీప? నన్ను పిల్లల ముందు ఎందుకు ఇరికిస్తుంది? ఇప్పుడు సౌర్య వచ్చి మా నాన్న ఎవరు అని అడిగితే ఎవరిని చూపించాలి? ఆ పసిదానికి నీ పుట్టుక ఇది అని దానికి ఎలా చెప్పాలి? రేపు హిమా కూడా నన్ను అదే ప్రశ్న అడిగితే..? ఎందుకు దీప ఇలా నా చుట్టూ వలయ అల్లుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్.

సౌందర్య, దీప ఒక చోట కలుసుకుంటారు. దీప, సౌందర్యతో హిమ వాళ్ళ నాన్న ని అడిగింది అత్తయ్య.. అంటుంది. దాంతో సౌందర్య అయినా సౌర్యకి నీకు చెప్పని వాడు హిమకి నేనే తండ్రినని ఎలా చెబుతాడే అంటుంది. ఇక దీప సౌర్య తన తండ్రి మీద పెట్టుకున్న ఆశల గురించి చెబుతుంది. భర్త కోసం నేను, తండ్రి కోసం నా కూతురు సౌర్య, తల్లి లేనే లేదని హిమ, ఇలా అంతా భాదపడుతున్న కూడా ఆ మనిషి మాత్రం ఏం పట్టనట్లుగా ఉంటున్నారు’ అంటుంది దీప. ఇన్నాళ్లు మిమ్మల్ని కలపడానికి మా పెద్దరికం పనికి రాలేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని కలిపేందుకు మీ పిల్లలే ప్రయత్నం చేస్తున్నారు.. వాళ్ల ప్రయత్నం ఎప్పటికైనా మిమ్మల్ని ఒకటి చేస్తుంది. కానీ ఎప్పుడు ఈ సమస్యని ఎలా ఎదుర్కుంటావే.. వాడు రాకపోతే సౌర్యకి ఏం సమాధానం చెబుతావే అంటుంది సౌందర్య బాధగా.

సౌర్య కోసమైనా ఎదో ఒకటి చేస్తాను అత్తయ్య.. డాక్టర్ బాబుని రప్పిస్తాను, సౌర్యకి తన తండ్రిని చూపిస్తాను’ అంటుంది దీప. సరిగ్గా అప్పుడే మౌనిత దూరం నుంచి వీళ్లిద్దరినీ చూసి.. ఫొటో తీస్తుంది. ఆ ఫొటోని కార్తీక్ పంపిస్తే.. కార్తీక్ మనసు మరింత విరిగిపోతుంది. దాంతో సౌందర్యని నమ్మడం మానేస్తాడు కార్తీక్. అని అనుకుంటుంది మౌనిత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here