అందుకే ఎమ్మార్వో విజయారెడ్డిని హత్య చేశా: నిందితుడు సురేష్

0
250

ఎమ్మార్వో విజయారెడ్డిని హత్య చేయడానికి గల కారణాలను నిందితుడు సురేష్ వెల్లడించాడు. ప్రస్తుతం 60 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్.. వైద్యుల సమక్షంలో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వనందువల్లే ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పంటించానని తెలిపాడు.

తనకు పట్టా ఇవ్వాలని ఎంతో బతిమలాడానని.. కానీ ఆమె కనికరించలేదని తెలిపాడు. సోమవారం మధ్యాహ్నం కూడా ఆమెను విజ్ఞప్తి చేశానని, కానీ ఆమె స్పందించలేదన్నాడు. అనంతరం తాను పెట్రోల్ డబ్బాతో కార్యాలయానికి వెళ్లానని.. మొదట తనపై పోసుకొని, ఆ తర్వాత ఆమెపై పోశానన్నాడు. తనకు నిప్పంటించుకొని ఆమెను కూడా తగులబెట్టానని సురేష్ తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here