ఎన్టీఆర్ మూవీలో ఇస్మార్ట్ గర్ల్.!

4
50

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్ ప్రస్తుతం సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సరసన ‘సోలో బ్రతుకే సో బెటర్’.. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ‘అల్లుడు అదుర్స్’ మూవీల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ భామ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రానున్న చిత్రంలో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ చిత్రంలో నభా తెలంగాణ అమ్మాయిగా సెకండ్ హీరోయిన్ గా కనిపించనుందట. ఈ చిత్రానికి ‘అయిననూ పోయి రావాలె హస్తినకు’ అనే టైటిల్ ను ఓకే చేసారు.

ప్రస్తుతం ఈ లాక్ డౌన్ సమయంలో త్రివిక్రమ్ ఈ మూవీ స్క్రిప్ట్ ను దాదాపు రెడీ చేసినట్లు సమాచారం. రాజకీయ పరిణామాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ర్ మూవీలో కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తైన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీలో నటించనున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here